Kangana Comments: అప్పట్లో వేషధారణ ఎలా ఉండేదో ఊహించగలరా?
ABN , First Publish Date - 2023-06-18T16:36:23+05:30 IST
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ అంటే గుర్తొచ్చే పేరు కంగనా రనౌత్ (kangana ranaut). టాపిక్ ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ అంటే గుర్తొచ్చే పేరు కంగనా రనౌత్ (kangana ranaut). టాపిక్ ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రామాయణంలోని కొన్ని ఘట్టాలకు సంబంధించిన ఫొటోలు షేర్ చేసిన ఆమె రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఓ సినిమాలోని పాటను జోడించారు. (Kangana Comments on Adipurush)
‘‘ప్రస్తుతం ఉన్న వాళ్లతో పోలిస్తే కొన్ని సంవత్సరాల క్రితం ప్రజల భాష వారి అలవాట్లు, వాళ్ల ప్రేమాభిమానం ఎంతో భావోద్వేగంతో కూడినవిగా ఉండేవి. అలాంటప్పుడు ఏడు వేల సంవత్సరాల క్రితం ప్రజలు ఎలా ఉండేవారు? వాళ్ల వేషధారణ ఎలా ఉండేదో కనీసం మీరు ఊహించగలరా..?’’ అంటూ రాసుకొచ్చారు. ఆమె వ్యాఖ్యలు ‘ఆదిపురుష్’ సినిమాను ఉద్దేశించే అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదిపురుష్’ రెండు రోజుల్లో భారీ వసూళ్లు రాబట్టింది.
ఇక కంగనా మరో చిత్రంపై కూడా కామెంట్ చేశారు. నితీశ్ తివారి దర్శకత్వంలో రానున్న ‘రామాయణం’పై కూడా ఆమె ఘాటుగా స్పందించారు, ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా ఆలియాభట్ నటించబోతున్నారని బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. దీనిపై గురించి కంగనా మాట్లాడారు. ‘‘ఇటీవల శివుడిగా ప్రకటించుకున్న ఈ నటుడికి ఇప్పుడు రాముడు కావాలనే కోరిక పుట్టింది’’ అని పేర్కొన్నారు.