Kajal: చాలా ఆలస్యం చేశారు.. ఇప్పుడు అంతా అయిపోయింది!

ABN , First Publish Date - 2023-07-01T17:31:51+05:30 IST

‘‘ప్రసవానంతరం ఉన్న డిప్రెషన్‌ను అందరి మహిళలలాగే నేనూ ఎదుర్కొన్నా. అది ప్రతి మహిళకు సర్వసాధారణం. మహిళలు ఎవరైనా పోస్ట్‌ పార్టమ్‌ డిప్రెషన్‌తో ఇబ్బందిపడుతుంటే కుటుంబం వారికి అండగా నిలవాలి’’ అని కాజల్‌ అన్నారు.

Kajal: చాలా ఆలస్యం చేశారు.. ఇప్పుడు అంతా అయిపోయింది!

‘‘ప్రసవానంతరం ఉన్న డిప్రెషన్‌ను అందరి మహిళలలాగే నేనూ ఎదుర్కొన్నా. అది ప్రతి మహిళకు సర్వసాధారణం. మహిళలు ఎవరైనా పోస్ట్‌ పార్టమ్‌ డిప్రెషన్‌తో ఇబ్బందిపడుతుంటే కుటుంబం వారికి అండగా నిలవాలి’’ అని కాజల్‌ (Kajal) అన్నారు. .పెళ్లి, ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా సినిమాలతో బిజీ అయ్యారు కాజల్‌ అగర్వాల్‌. ప్రస్తుతం తెలుగులో ‘భగవంత్‌ కేసరి’, ‘సత్యభామ’, తమిళంలో ‘ఇండియన్‌-2’ (Indian2) చిత్రాల్లో నటిస్తోంది. కాస్త తీరిక దొరికిన కాజల్‌ కాసేపు ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించారు. ఫ్యాన్‌ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. ఏప్రిల్‌ 19, 2022న మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్‌ పోస్ట్‌ పార్టమ్‌ డిప్రెషన్‌ గురించి ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తన బిడ్డ నీల్‌ చాలా బాగున్నాడనీ షూటింగ్‌తో ఇంటికి దూరంగా ఉన్నప్పుడు నా కుటుంబ సభ్యులు వాడిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు అని కాజల్‌ తెలిపారు.

ప్రస్తుతం ఇండియన్‌-2 లొకేషన్‌లోనే ఉన్నా. కథ, నా క్యారెక్టర్‌, వస్తున్న అవుట్‌పుట్‌ ఇలా ప్రతి విషయంలో ఎంతో సంతృప్తిగా ఉన్నా. మీ అందరికీ ఈ చిత్రాన్ని చూపించేందుకు టీమ్‌ మొత్తం ఆతృతగా ఎదురుచూస్తున్నాం. . నా దగ్గరకు వచ్చిన పాత్రకు న్యాయం చేయలేకపోయినప్పుడు అభిమానులతో పాటు నేనూ ఎంతో బాధపడతా. పోషించే ప్రతి పాత్రకు ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతున్నారా? లేదా అని భయపడుతుంటా.

ఎస్‌.. డ్రిపెషన్‌ ఎదుర్కొన్నా.. (postpartum depression)

ప్రసవానంతర ఉన్న డిప్రెషన్‌ను అందరి మహిళలలాగే నేనూ ఎదుర్కొన్నా. అది సర్వసాధారణం. మహిళలు ఎవరైనా పోస్ట్‌ పార్టమ్‌ డిప్రెషన్‌తో ఇబ్బందిపడుతుంటే కుటుంబం వారికి అండగా నిలవాలి. మహిళలు సైతం పిల్లలు పుట్టిన తర్వాత తమకంటూ కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. ట్రైనర్‌ ఆధ్వర్యంలో వర్కౌట్లు చేయడం.. ఇష్టమైన వ్యక్తులతో సమయం గడపటం.. ఇలా చిన్న చిన్న పనులతో ఆ దశను దాటొచ్చు. నన్నెంతగానో అర్థం చేసుకునే కుటుంబ సభ్యులు ఉండడంతో ఆ దశ నుంచి వెంటనే బయటకు రాగలిగాను. ఆ సమయంలో నా భర్త గౌతమ్‌ క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఒత్తిడి నుంచి బయటకు రావడానికి పిల్లలతో ఆడుతుంటా.

ఆ ఎనర్జీ వేరు...

వృత్తి, వ్యక్తిగత జీవితాలను బ్యాలెన్స్‌ చేయడం ఎంతో కష్టం కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా మాట్లాడటం కుదరదు. ఆ సమయం దొరకదు. ఫ్యాన్స్‌తో మాట్లాడితే ఎనర్జీ హైలో ఉంటుంది. అభిమానుల్ని ఎప్పుడు ఇష్టపడుతూనే ఉంటా. ఆన్‌లైన్‌లో మాట్లాడటం లేదని ఏమీ అనుకోవద్దు. అర్థం చేసుకోండి.

తమన్నా భయపెట్టింది..

తమన్నా, రకుల్‌, సమంత వీళ్లంటే నాకెంతో ఇష్టం. స్వయంకృషితో తమ కెరీర్‌ నిర్మించుకున్నారు. మేమంతా స్నేహంగా ఉంటాం. మా మధ్య ఎన్నో మధురానుభూతులున్నాయి. వాళ్లతో సరదాగా సమయాన్ని గడపడానికి నేను ఇష్టపడుతుంటా ఇంకా నాకు తెలిసిన మంచి వ్యక్తుల్లో అల్లు అర్జున్‌ ఒకరు. ఆయన ఎనర్జీని నేనెంతో ఇష్టపడుతుంటా. నిన్న రాత్రే తమన్నా నటించిన ‘లస్ట్‌ స్టోరీస్‌-2’ చూశా. చాలా బాగా యాక్ట్‌ చేసింది. ఆమె నన్ను ఎంతో భయపెట్టేసింది. ప్రస్తుతం నేను చేస్తున్న ‘సత్యభామ’ పోలీస్‌ డ్రామా నేపథ్యంలో రూపొందుతోంది.

23.jpg

బెస్ట్‌ రోల్‌...

ఇన్నేళ్ల జర్నీలో ప్రతి పాత్ర నా ఉన్నతికి ఉపయోగపడిందే. ఏదీ తక్కువ కాదు. ప్రతి పాత్ర మధురానుభూతిచ్చింది. జనాల ఆదరణ ప్రకారం కొన్ని మాత్రం ప్రత్యేకం అనే చెప్పాలి. మిత్రవింద (మగధీర), నందిని (డార్లింగ్‌), ప్రియ (మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌) తాజాగా చేస్తున్న సత్యభామ. నాకు నెగిటివిటీ ఎదురైతే పాజిటివిటీపై ఫోకస్‌ చేస్తా. ఇబ్బంది పెట్టే వ్యక్తులకు దూరంగా ఉంటా. ఒత్తిడిలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండటాన్ని కొంతమంది గురువులు నేర్పించారు. ప్రాక్టీస్‌తో అది సాధ్యం.

అదొక సవాలే...

ప్రతి ఒక్కరికీ జీవితం అందమైన క్షణాలను అందిస్తుంటుంది. ప్రతి క్షణాన్ని మనం బెస్ట్‌గా మార్చుకోవాలి. బిడ్డకు జన్మనివ్వడం అనేది ఒక వరం. అందుకు నేను ఎంతో ఆనందంగా ఉన్నా. బిడ్డ పుట్టిన తర్వాత ప్రతి మహిళ శరీరాకృతిలో మార్పు వస్తుంది. సవాల్‌గా తీసుకుని వర్కవుట్స్‌తో మనం మళ్లీ ఫిట్‌గా తయారు కాగలం. రెండు నెలల్లోనే వర్క్‌ లైఫ్‌లో బిజీగా కావడంతో నా విషయంలో ఇవన్నీ చాలా ఫాస్ట్‌గా జరిగిపోయాయి.

నన్ను పెళ్లి చేసుకుంటారా? అని ఓ నెటిజన్‌ అడిగిన చిలిపి ప్రశ్నకు.. ‘సారీ రెండున్నరేళ్ల క్రితమే ఆ అవకాశం మరొకరిని వరించింది. ఇప్పుడు అంతా అయిపోయింది. చాలా ఆలస్యం చేశారు’ అని పంచ్‌ వేసింది.

Updated Date - 2023-07-01T17:31:51+05:30 IST