Tollywood movies: సినిమాలు వరుసకట్టాయి

ABN , First Publish Date - 2023-07-02T14:03:57+05:30 IST

చూస్తుండగానే ఏడాదిలో అర్ధ భాగం పూర్తయిపోయింది. సినిమా రీల్‌ గిర్రున తిరిగినట్లు ఆరు నెలలు ఇట్టే గడిచిపోయాయి. అప్పుడు ఆరు నెలలు గడిచిపోయాయి. గడిచిన 181 రోజుల్లో వందకు పైగా చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి.

Tollywood movies: సినిమాలు వరుసకట్టాయి

చూస్తుండగానే ఏడాదిలో అర్ధ భాగం పూర్తయిపోయింది. సినిమా రీల్‌ గిర్రున తిరిగినట్లు ఆరు నెలలు ఇట్టే గడిచిపోయాయి. అప్పుడు ఆరు నెలలు గడిచిపోయాయి. గడిచిన 181 రోజుల్లో వందకు పైగా చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ప్రథమార్ధంలో ప్యాన్‌ ఇండియా చిత్రాలతో పాటు లో బడ్జెట్‌ చిత్రాలు సందడి చేశాయి. వాటిలో బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తే మరికొన్ని అంచనాలను చేరుకోలేకపోయాయి. కళా బలంతో వచ్చిన చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ద్వితీయార్థం హవా మొదలైంది. అందులో భాగంగా జులైలో థియేటర్లలో సందడి చేయడానికి సినిమాలు వరుస కట్టాయి. దాదాపు ఈ నెలలో 20కి పైగా చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అవేంటో చూద్దాం.

జూలై 7:

రంగబలి: నాగ శౌర్య, యుక్తి తరేజా జంటగా పవన్‌ బాసంశెట్టి తెరకెక్కించిన సినిమా ఇది. యూత్‌ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది.

భాగ్‌సాలే: సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీ సింహా కోడూరి కథానాయకుడిగా నటించిన చిత్రమిది. నేహా సోలంకి కథానాయిక. ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి దర్శకుడు. బిగ్‌బెన్‌ సినిమాస్‌, సినీ వాలీస్‌ మూవీస్‌ పతాకంపై అర్జున్‌ దాస్యన్‌, యశ్‌ రంగినేని, సింగనమల కల్యాణ్‌ నిర్మించారు.

రుద్రంగి: జగపతిబాబు, ఆశిష్‌ గాంధీ, గానవి లక్ష్మణ్‌, విమలా రామన్‌, మమతా మోహన్‌దాస్‌ కీలక పాత్రధారులుగా రూపొందిన చిత్రమిది. యాక్షన్‌, పీరియాడికల్‌ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని ఎమ్మెల్యే, కవి రసమయి బాలకిషన్‌ నిర్మాత. అజయ్‌ సామ్రాట్‌ దర్శకుడు.

7:11 పిఎం: సాహస్‌, దీపిక జంటగా సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. చైతు మాదాల దర్శకత్వం వహించారు.

సర్కిల్‌: చాలా గ్యాప్‌ తర్వాత నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌ నీలకంఠ రూపొందించిన చిత్రమిది. సాయిరోనక్‌, బాబా భాస్కర్‌, అర్షిణ్‌ మెహతా, రిచా పనై, నైనా కీలక పాత్రలు పోషించారు.

ఓ సాథియా: ఆర్యన్‌ గౌరా, మిస్తీ చక్రవర్తి జంటగా దివ్యభావన దర్శకత్వం వహించిన చిత్రమిది.

ఇద్దరు: అర్జున్‌, జెడీ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఎస్‌.ఎస్‌.సమీర్‌ తెరకెక్కించిన చిత్రమిది.

08-07-2023

యే మేరా రివెంజ్‌: అనుపమ్‌ ఖేర్‌, శక్తి కపూర్‌ నటించిన చిత్రమిది. ఇక్బాల్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు.

12-07-2023

ఘోస్ట్‌: కన్నడ నటుడు శివరాజ్‌ కుమార్‌ కీలక పాత్ర పోషించిన చిత్రమిది. శ్రీని దర్శకుడు.

14-07-2023

బేబీ: ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య ముఖ్య పాత్రలు పోషించిన చిత్రమిది. సాయి రాజేశ్‌ దర్శకత్వం వహించారు.

మా వీరన్‌: శివ కార్తికేయన్‌, అదితి శంకర్‌ జంటగా నటించిన సినిమా ఇది. మడోన్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో ‘మహా వీరుడు’ పేరుతో విడుదల కానుంది.

21-07-2023

స్లమ్‌ డాగ్‌ హస్బెండ్‌: సంజయ్‌ రావ్‌ హీరోగా ఎ.ఆర్‌ శ్రీధర్‌ తెరకెక్కించిన చిత్రమిది. ప్రణవి మానుకొండ కథానాయిక. స్లమ్‌ ఏరియాలో ఉండే ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య సాగే కథ ఇది.

అన్నపూర్ణ స్టూడియో: చైతన్య రావ్‌, లావణ్య జంటగా నటించిన ఈ సినిమాకి చెందు ముద్ద దర్శకత్వం వహించారు.

హత్య: ‘బిచ్చగాడు’, ‘బిచ్చగాడు 2’ వంటి విభిన్నమైన చిత్రాలతో.. తెలుగులో ప్రేక్షకులను అలరించిప విజయ్‌ ఆంటోని హీరోగా నటించిన చిత్రమిది. ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘హత్య’ టైటిల్‌తో విడుదల చేశారు. బాలాజీ కుమార్‌ దర్శకత్వం వహించారు.

28-07-2023

బ్రో: అగ్ర కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌, ఆయన మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్‌ కలిసి నటించిన చిత్రం ‘బో’. సముద్రఖని దర్శకుడు. తమిళంలో హిట్టైన ‘వినోదాయ సిత్తం’ చిత్రానికి రీమేక్‌ ఇది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజి విశ్వప్రసాద్‌ నిర్మించారు.

Updated Date - 2023-07-02T14:05:45+05:30 IST