Jr NTR: ఐకాన్‌స్టార్‌కు తారక్‌ శుభాకాంక్షలు!

ABN , First Publish Date - 2023-08-25T10:34:09+05:30 IST

తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకూ సాధ్యం కాని అరుదైన ఘనతను ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (allu arjun) సాధించారు. ఉత్తమ నటుడిగా నేషనల్‌ అవార్డు అందుకున్న తొలి తెలుగు కథానాయికుడిగా నిలిచారు. కలెక్షన్ల పరంగానే కాకుండా అవార్డుల విషంలోనూ తగ్గేదేలే అని నిరూపించారు. ‘పుష్ప’ (Pushpa) అంటే ఫ్లవర్‌ కాదు ఫైరు’ అని చాటి చెప్పారు.

Jr NTR: ఐకాన్‌స్టార్‌కు తారక్‌ శుభాకాంక్షలు!

తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకూ సాధ్యం కాని అరుదైన ఘనతను ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (allu arjun) సాధించారు. ఉత్తమ నటుడిగా నేషనల్‌ అవార్డు అందుకున్న తొలి తెలుగు కథానాయికుడిగా నిలిచారు. కలెక్షన్ల పరంగానే కాకుండా అవార్డుల విషంలోనూ తగ్గేదేలే అని నిరూపించారు. ‘పుష్ప’ (Pushpa) అంటే ఫ్లవర్‌ కాదు ఫైరు’ అని చాటి చెప్పారు. సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘పుష్ప: ది రైజ్‌’ చిత్రంలో నటనకిగానూ అల్లు అర్జున్‌ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఇతర భాషల నుంచి ఉద్ధండులైన కథానాయకులు ఎందరో పోటీ పడ్డారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి రామ్‌చరణ్‌, తారక్‌ గట్టి పోటీగా నిలిచారు. కానీ ‘పుష్ప’ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఐకాన్‌స్టార్‌కు నేషనల్‌ అవార్డు దక్కింది. ‘పుష్ప’ చిత్రం కోసం బన్నీ ఎంతగా కష్టపడ్డారో సినిమాలో ఆయన పాత్రను, మేకోవర్‌ను, పాత్ర తీరును చూస్తే అర్థమవుతోంది. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలంగా జాతీయ పురస్కారం దక్కింది. అల్లు అర్జున్‌కు జాతీయ పురస్కారం దక్కడం పట్ల చిత్ర పరిశ్రమ, అభిమానుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.

తాజాగా జూ ఎన్టీఆర్‌ అల్లు అర్జున్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ‘‘కంగ్రాట్స్‌ బావ. ‘పుష్ప’ కోసం నువ్వు పొందిన ఈ పురస్కారానికి, సక్సెస్‌కి నువ్వు అర్హుడివి బావా. మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నా’’ అని అన్నారు. (best actor allu arjun)

తొలి తెలుగు నటుడివి: నాగబాబు

అల్లు అర్జున్‌కు నాగబాబు శుభాకాంక్షలు తెలిపారు. ‘కంగ్రాట్స్‌ బన్నీ బాయ్‌. 69న జాతీయ పురస్కారాల్లో ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నందుకు ప్రత్యేక అభినందనలు. తెలుగు సినిమాలో ఇంతటి గర్వకారణమైన ఘనత సాధించిన తొలి నటుడివి నువ్వే’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2023-08-25T10:38:29+05:30 IST