Jr Ntr : తండ్రి జ్ఞాపకాలు తలుచుకుంటూ...
ABN , First Publish Date - 2023-09-02T13:35:32+05:30 IST
తన తండ్రి నందమూరి హరికృష్ణ 67వ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగ పోస్ట్ చేశారు. ఆగస్ట్ 29, 2018లో రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించిన సంగతి తెలిసిందే. ఓ అభిమాని పెళ్లికి హాజరు కావడం కోసం నెల్లూరు జిల్లా కావలికి కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుండగా నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి సమీపంలో కారు రోడ్డు ప్రమాదానికి గురై ఆయన మరణించారు
తన తండ్రి నందమూరి హరికృష్ణ (nandamuri Hari Krishna) 67వ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ (Jr ntr) భావోద్వేగ పోస్ట్ చేశారు. ఆగస్ట్ 29, 2018లో రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించిన సంగతి తెలిసిందే. ఓ అభిమాని పెళ్లికి హాజరు కావడం కోసం నెల్లూరు జిల్లా కావలికి కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుండగా నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి సమీపంలో కారు రోడ్డు ప్రమాదానికి గురై ఆయన మరణించారు. నేడు ఆయన జయంతి. ఈ సందర్భంగా తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తారక్, కల్యాణ్‌రామ్ ట్వీట్ చేశారు. (Kalyan ram)
‘‘ఈ అస్తిత్వం మీరు..
ఈ వ్యక్తిత్వం మీరు..
మొక్కవోని ధైర్యంతో కొనసాగే
మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు..
ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే’’ అంటూ భావోద్వేంగా పోస్ట్ చేశారు.