Jr Ntr-Allu Arjun: చరణ్ దంపతులకు సెలబ్రిటీల శుభాకాంక్షలు!
ABN , First Publish Date - 2023-06-20T12:16:15+05:30 IST
మెగా ప్రిన్సెస్ రాకతో మెగా కుటుంబంలో సందడి నెలకొంది. రామ్‌చరణ్-ఉపాసన తల్లిదండ్రులయ్యారు.సోమవారం రాత్రి ఉపాసన అపోలో ఆస్పత్రిలో చేశారు. ఆ సమయంలో భర్త రామ్‌చరణ్, అత్త సురేఖ తదితరులు ఉపాసన వెంటే ఉన్నారు.
మెగా ప్రిన్సెస్ (Mega Princess) రాకతో మెగా కుటుంబంలో సందడి నెలకొంది. రామ్‌చరణ్ (Ram charan)-ఉపాసన తల్లిదండ్రులయ్యారు.సోమవారం రాత్రి ఉపాసన అపోలో ఆస్పత్రిలో చేశారు. ఆ సమయంలో భర్త రామ్‌చరణ్, అత్త సురేఖ తదితరులు ఉపాసన (Upasana) వెంటే ఉన్నారు. మంగళవారం తెల్లవారుజామున ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు చిరంజీవి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చిరంజీవి, సురేఖ ఉదయాన్నే తమ మనవరాలిని చూసి మురిసిపోయారు. అల్లు అరవింద్ దంపతులు, అల్లు అర్జున్(Allu arjun), స్నేహ, విక్కీ, డి.వి.వి.దానయ్య తదితరులు రామ్‌చరణ్ దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. (allu aravind)
అలాగే పలువు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా రామ్‌చరణ్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ మేరకు జూ. ఎన్టీఆర్(Tarak) ట్వీట్ చేశారు. ‘‘కంగ్రాట్స్ చరణ్ - ఉపాసన. పేరెంట్స్ క్లబ్‌కు స్వాగతం. ఆడ బిడ్డతో గడిపిన ప్రతి క్షణం జీవితాంతం ఎంతో మధురానుభూతిగా నిలుస్తుంది. అదొక గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుంది’’ అని ట్వీట్ చేశారు తారక్.