Kabir Singh wedding: ఓ ఇంటివాడైన విలన్, ఫోటోస్ వైరల్
ABN , First Publish Date - 2023-06-24T10:06:55+05:30 IST
హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ లో పుట్టి, ముంబై నగరానికి మోడలింగ్ లో ప్రయత్నిద్దాం అని వచ్చి, 'జిల్' సినిమాతో విలన్ గా కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు దక్షిణాదిలో ప్రముఖ విలన్ లలో ఒకడుగా వున్న కబీర్ దుహన్ సింగ్ ఒక ఇంటివాడయ్యాడు. సీమ చాహల్ ని ఫరీదాబాద్ లో ఒక హోటల్ లో వివాహం చేసుకున్నాడు.
గోపీచంద్ (Gopichand), రాశి ఖన్నా (RaashiKhanna) నటించిన 'జిల్' #Jil సినిమాలో విలన్ గుర్తున్నాడు కదా. టాలీవుడ్ కి ఇంకొక కొత్త విలన్ దొరికాడు అని ఆ సినిమా విడుదల అయ్యాక అనుకున్నారు కదా. అతను ఎవరో కాదు కబీర్ దుహాన్ సింగ్ (KabirDuhanSingh). ఆ తరువాత చాలా తెలుగు, కన్నడ, తమిళం లో సినిమాలు చేసాడు కబీర్ సింగ్. ఈమధ్యనే విడుదల అయిన గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వం వహించిన 'శాకుంతలం' (Shakuntalam) సినిమాలో అసుర పాత్రలో కనపడతాడు కబీర్ సింగ్.
పవన్ కళ్యాణ్ (PawanKalyan) నటించి, నిర్మించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' #SardarGabbarSingh లో కూడా ఒక ముఖ్యమైన విలన్ గా కబీర్ సింగ్ కనపడతాడు. అలాగే శ్రీవాస్ (Sriwaas), బెల్లంకొండ శ్రీనివాస్ (BellamkondaSreenivas) కాంబినేషన్ లో వచ్చిన 'సాక్ష్యం' (Sakshyam) సినిమాలో కూడా విలన్ గా మెప్పించాడు కబీర్.
ఇలా దక్షిణాదిలో విలన్ గా అందరికీ సుపరిచితం అయిన కబీర్ సింగ్ ఇప్పుడు ఒక ఇంటివాడయ్యాడు. సీమ చాహల్ #SeemaChahal ని ఫరీదాబాద్ లోని KabirSinghwedsSeemaChahal ఒక హోటల్ లో ఆమెని అంగరంగ వైభోవంగా వివాహం చేసుకున్నాడు. అతని దగ్గరి బంధువులు, స్నేహితులు ఈ వివాహానికి హాజరయ్యారు. KabirSinghWedding అలాగే అతనికి పరిశ్రమనుండి కొంతమంది స్నేహితులు శుభాకాంక్షలు కూడా చెప్పారు.
కబీర్ సింగ్ స్క్రీన్ మీద విలన్ గా అందరికీ పరిచయమే కానీ, ఇప్పుడు అతని భార్య సీమకి మాత్రం అతనే హీరో. KabirSinghWedding "ఇప్పటి నుండి కొత్త జీవితం ప్రారంభిస్తున్నాను. నా స్నేహితులు, అభిమానులు అందరి ఆశీర్వాదంతో కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నాను, నా భార్యకి కూడా మీ అందరి ఆసిస్సులు కావాలి. ఆమె జీవితంలో ఇక నేను హీరో గా జీవితాంతం కొనసాగుతాను," అని చెప్పాడు కబీర్ సింగ్.
వీరిద్దరి పెళ్లి ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హర్యానాలోని ఫరీదాబాద్ లో పుట్టి, అక్కడే పెరిగాడు కబీర్. 2001 లో ముంబైలో మోడలింగ్ చేద్దామని అడుగుపెట్టాడు. మోడలింగ్ చేస్తూ చాల ఫ్యాషన్ ఎసైన్మెంట్స్ లో పార్టిసిపేట్ చేసాడు. ఒక హిందీ సినిమాతో ఆరంగేట్రం చెయ్యాలి, కానీ ఆ సినిమా మధ్యలోనే షేల్వ్ అయిపొయింది.
అప్పుడు తెలుగు సినిమా 'జిల్' నిర్వాహకులు ఒక నార్త్ ఇండియన్ లా వుండే విలన్ కోసం చూసి, కబీర్ సింగ్ ని ఆడిషన్ చేశారు. అతను ఆలా ఒక తెలుగు సినిమాలో తన సినిమా కెరీర్ ని ప్రారంభించాడు. అతని నటనకి మెచ్చి వెంటనే దర్శకుడు సురేందర్ రెడ్డి (SurenderReddy) 'కిక్ 2' లో అవకాశం ఇచ్చాడు. రవితేజ (RaviTeja) నటించిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినా, కబీర్ మాత్రం విలన్ గా అందరినీ ఆకట్టుకొని వరస సినిమాలు చేస్తూనే వున్నాడు. ఇప్పుడు మరాఠీ లో కూడా చేస్తున్నాడు.