Jamuna: ఆత్మాభిమానమే ఆరోప్రాణంగా.. 

ABN , First Publish Date - 2023-01-27T13:47:40+05:30 IST

నటరత్న ఎన్టీఆర్‌తో అత్యధిక చిత్రాల్లో నటించిన కథానాయిక కళాభారతి జమున. ఆయన సరసన 31 చిత్రాల్లో నటించారామె! ఎన్టీఆర్‌ను జమున తొలిసారిగా కలుసుకున్నది ‘వద్దంటే డబ్బు’ చిత్రం షూటింగ్‌లో. దర్శక పితామహుడు హెచ్‌ ఎం రెడ్డి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ హీరో. హీరోయిన్‌ జమున కాదు షావుకారు జానకి.

Jamuna: ఆత్మాభిమానమే ఆరోప్రాణంగా.. 

  
నటరత్న ఎన్టీఆర్‌తో అత్యధిక చిత్రాల్లో నటించిన కథానాయిక కళాభారతి జమున(kalabharati jamuna). ఆయన సరసన 31 చిత్రాల్లో నటించారామె! ఎన్టీఆర్‌ను జమున తొలిసారిగా (Rip jamuna)కలుసుకున్నది ‘వద్దంటే డబ్బు’ చిత్రం షూటింగ్‌లో. దర్శక పితామహుడు హెచ్‌ ఎం రెడ్డి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ హీరో. హీరోయిన్‌ జమున కాదు షావుకారు జానకి. సెకండ్‌ హీరోయిన్‌ జమున. అప్పటికే ఆమె నటించిన తొలి చిత్రం ‘పుట్టిల్లు’ (puttillu)పూర్తయింది. మొదటి సినిమా లో హీరోయిన్‌గా నటించి రెండో చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌ గా చేయడమంటే ఒక మెట్టు దిగడం లాంటిదే అనుకుని ఆ సినిమా చేయనన్నారు జమున. కానీ హెచ్‌ ఎం రెడ్డి వంటి పెద్ద దర్శకుడు చిత్రం లో నటించనని చెప్పడం బాగుండదని ఆమె తండ్రి కన్విన్స్‌ చేయడంతో అంగీకరించారు జమున. ఆ చిత్రంలో పేకేటి సరసన ఆమె నటించారు. వద్దంటే డబ్బు సక్సెస్‌ కాలేదు. వద్దంటే డబ్బు నిర్మాణంలో వుండగానే ‘అంతా మనవాళ్ళే’ చిత్రంలో కూడా సెకండ్‌ లీడ్‌గా నటించారు. ఆ సినిమా హిట్‌అయింది. సోలో హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం ‘మా గోపీ’  వల్లం నరసింహారావు ఈ చిత్రంలో హీరో. ఇది నిర్మాణంలో ఉండగానే దొంగరాముడు చిత్రంలో అక్కినేని చెల్లెలిగా నటించారు జమున. ఈ చిత్రం విజయం సాధించడంతో జమున జాతకం (egendary actress Jamuna)మారిపోయింది. ఎన్టీఆర్‌ సరసన హీరోయిన్‌గా జమున నటించిన తొలి చిత్రం ‘ఇద్దరు పెళ్ళాలు’. ఈ సినిమాలోనే ఎన్టీఆర్‌ తొలిసారి శ్రీకృష్ణుడి గెటప్‌ వేశారు. ఈ చిత్రం ఆడ లేదు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ తో నటించిన చిత్రం సంతోషం. ఇది హిందీలో ‘నయా ఆద్మీ’ పేరుతో రూపుదిద్దుకుంది. ఎన్టీఆర్‌, జమున ఈ చిత్రంతోనే ఉత్తరాదికి పరిచయం అయ్యారు. (Tollywood legendary actress Jamuna passes away)

ఎన్టీఆర్‌ తల్లిగా... జనం గొల్లుమంటారయ్యా! 


రచయిత సముద్రాల దర్శకత్వంలో వచ్చిన ‘వినాయక చవితి’ చిత్రంలో ఎన్టీఆర్‌ కృష్ణుడైతే, జమున సత్యభామ.  తొలిసారి ఆమె ఆ పాత్ర పోషించారు. ఆ తర్వాతి కాలంలో సత్యభామ అంటే జమునే గుర్తుకు వచ్చేలా ఆ పాత్రను ఆమె సొంతం చేసుకున్నారు. 1958 లో వచ్చిన ‘భూకైలాస్‌’ చిత్రంలో ఎన్టీఆర్‌ రావణాసురుడుగా, జమున మండోదరిగా నటించారు. ఈ చిత్ర నిర్మాణంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల అగ్ర నటులు ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ జమునతో ఇక నటించకూడదని నిర్ణయించుకున్నారు. ఫలితంగా నాలుగేళ్లు  వీరిద్దరి చిత్రాలకు జమున దూరం అయ్యారు. 1962లో మళ్లీ ‘గుండమ్మ కథ’ చిత్ర నిర్మాణ సమయంలో ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, జమున మధ్య సయోధ్య  కుదిరిచ్చారు నిర్మాత చక్రపాణి. ఈ చిత్రంలో అక్కినేని సరసన జమున నటించగా, ఎన్టీఆర్‌ సొంత సినిమా ‘గులేబకావళి కథ’లో ఎన్టీఆర్‌ సరసన ఆమె నటించారు. మంగమ్మ శపథం చిత్రంలో తండ్రీ కొడుకులుగా ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేశారు. ఇందులో కథానాయిక మంగమ్మ తొలి భాగంలో ఒకరికి నాయికగా, మలిభాగంలో తల్లిగా నటించాలి.. ఆ పాత్రకు సీనియర్‌ నటిని తీసుకోమని చిత్ర నిర్మాత డి ఎస్‌ రాజుకు అంతా సలహా ఇచ్చారు. అయితే ఆత్మాభిమానమే ఆరో ప్రాణంగా బతికే జమున ఆ పాత్రకు సరిపోతారని ఆయన్‌ అభిప్రాయం. కానీ పరిశ్రమ లోని సీనియర్లంతా డి వి ఎస్‌ రాజుని భయపెట్టారు.  నిర్మాత చక్రపాణి కూడా ‘రామారావు వచ్చి జమునను అమ్మా అని పిలిస్తే జనం గొల్లుమంటారయ్యా చూసుకో మరి..’ అని హెచ్చరించారు. అయినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు డి.వి.ఎస్‌.రాజు. ద్వితీయార్థంలో తల్లీ కొడుకుల మధ్య సన్నివేశాలు తగ్గించారు. ఈ సినిమా ఘన విజయం సాధించింది. అలాగే మరోసారి మనుషులంతా ఒక్కటే చిత్రంలోనూ జమున, రామారావు. తల్లీ కొడుకులుగా  నటించారు. ఈ సినిమా కూడా హిట్‌ అయింది. ఎన్టీఆర్‌ తొలిసారి ద్విప్రాతాభినయం చేసిన ‘రాముడు భీముడు’ చిత్రంలోనూ జమునే కథానాయిక. ‘గులేబకావళి కథ’ చిత్రం తర్వాత ఎన్టీఆర్‌ సొంత చిత్రాలు అక్బర్‌ సలీం అనార్కలి, శ్రీరామ పట్టాభిషేకం చిత్రాల్లో జమున నటించారు. అలా మొత్తం 32 చిత్రాల్లో ఎన్టీఆర్‌ సరసన ఆమె నటించారు.

456.jpg

యు.వినాయకరావు 


Updated Date - 2023-01-27T14:23:27+05:30 IST