Jamuna: ఏవియమ్‌ సంస్థతో ప్రత్యేక అనుబంధం

ABN , First Publish Date - 2023-01-27T14:31:05+05:30 IST

జమున (jamuna) ఇష్టపడే సంస్థల్లో ఏవీయం ఒకటి. పుట్టిల్లు (1953) సినిమాతో రంగ ప్రవేశం చేసిన ఆవిడకి మరుసటి ఏడాదే ఏవియం సంస్థ అధినేత మొయ్యప్పన్‌ నుంచి పిలుపు వచ్చింది.

Jamuna: ఏవియమ్‌ సంస్థతో ప్రత్యేక అనుబంధం


జమున (jamuna) ఇష్టపడే సంస్థల్లో ఏవీయం ఒకటి. పుట్టిల్లు (1953) సినిమాతో రంగ ప్రవేశం చేసిన ఆవిడకి మరుసటి ఏడాదే ఏవియం సంస్థ అధినేత మొయ్యప్పన్‌ నుంచి పిలుపు వచ్చింది. కర్ణాటకకు చెందిన గుబ్బి సంస్థ 1954 లో తిదిం కాళహస్తి మహాత్మ్యం చిత్ర నిర్మాణ కార్యక్రమాలన్నీ ఏవియం సంస్థే (avm production)చూసింది. కన్నడ రాజ్‌ కుమార్‌కు ఇదే తొలి సినిమా. ఇందులో వ్యాంప్‌ వేషం జమునతో(jamuna) వేయించాలని మో అనుకున్నారు. అమే తండ్రి శ్రీనివాసరావు ను పిలిచి తన ప్రతిపాదన చెప్పారు. అలాంటి వేషం మా అమ్మాయి చేయదు అని స్పష్టంగా చెప్పేశారు శ్రీనివాసరావు. అప్పుడు రాజసులోచనతో ఆ వేషం వేయించారు. ఆ తర్వాత ఎవియం సంస్థ తెలుగులో ‘నాగుల చవితి, కన్నడంలో ఆదర్శ సతి పేర్లతో నిర్మించిన చిత్రాల్లో జమున కి హీరోయిన్‌ వేషం ఇచ్చారు  మొయ్యప్పన్‌. రెండు భాషల్లోనూ ఈ సినిమా బాగా ఆడింది. ఉత్తమ నటిగా ‘ఆదర్శ సతీ’ చిత్రంతో అవార్డ్‌ కూడా అందుకొన్నారు జమున. ‘నాగుల చవితి’తో ఏవిఎం సంస్థ తో మొదలైన అనుబంధం చాలా సంవత్సరాలు కొనసాగింది. 1968 లో మోయ్యప్పన్‌ తీసిన రెండు చిత్రాల్లో జమున హీరోయిన్‌గా నటించారు. ‘రాము’ చిత్రంలో ఎన్టీఆర్‌ హీరో. ‘మూగ నోము’ చిత్రం లో ఏయన్నార్‌ హీరో. ఉదయం నుంచి మధ్యాహ్నాం  వరకు రాము షూటింగ్‌లో, మధ్యాహ్నాం నుంచి మూగ నోము చిత్రానికి జమున పని చేసిన రోజులు ఉన్నాయి. (Jamuna special bonding with avm productions)


హిట్‌ పెయిర్‌..(Haranath hit pair)

అందాల నటుడు హరనాథ్‌, అభినేత్రి జమునలది హిట్‌ పెయిర్‌. లేత మనసులు చిత్రంలో ‘అందాల ఓ చిలకా అందుకో నా లేఖ’ పాట ఎంత పాపులర్‌ అయ్యిందో ఆ సినిమా విడుదల అయ్యాక ఈ జంట అంత పాపులర్‌ అయింది. ఆ తర్వాత ‘పాల మనసులు’, ‘పెళ్లి రోజు’, ‘ఆడ జన్మ’, తదితర చిత్రాల్లో వీరు కలిసి నటించారు.

శతాధిక చిత్రాలను నిర్మించిన సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ అధినేత రామానాయుడు (D ramanaidu) నిర్మించిన తొలి చిత్రం రాముడు భీముడు..ఎన్టీఆర్ తొలి సారిగా ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం లో హీరోయిన్ గా జమున నటించారు. ఆవిడ జీవితంలో 1964, 65 సంవత్సరాలకు విశేష ప్రాధాన్యం ఉంది. 1964 మే 21 న రాముడు భీముడు చిత్రం విడుదల అయింది. సరిగ్గా పదిహేను నెలలకి అంటే 1965 ఆగస్ట్ 4 న డాక్టర్ రమణారావు తో జమున వివాహం జరిగింది(Jamuna ramanarao). మద్రాస్ లో జరిగిన రిసెప్షన్ కి చిత్ర పరిశ్రమ తరలి వచ్చింది.

Updated Date - 2023-01-27T14:31:07+05:30 IST