Sathi Gani Rendu Ekaralu Trailer: అటు రెండెకరాలు.. ఇటు బిడ్డ ప్రాణాలు.. సత్తిగాడు ఏం చేస్తాడు?
ABN , First Publish Date - 2023-03-09T11:20:32+05:30 IST
సినిమాల్లో కమెడియన్స్‌గా చేసిన నటులు హీరోలుగా మారడం ఎప్పటి నుంచో వస్తున్నదే.
సినిమాల్లో కమెడియన్స్‌గా చేసిన నటులు హీరోలుగా మారడం ఎప్పటి నుంచో వస్తున్నదే. అయితే.. ఇటీవలే కాలంలో చాలా త్వరగా హీరోలుగా మారిపోతున్నారు. సుహాస్, సత్య, వెన్నెల కిశోర్ వంటి పలువురు హీరోలుగా తమ అదృష్టాన్ని పరిక్షించుకున్నారు. ఆ ప్రయత్నంలో పలువురు విజయం కూడా సాధించారు. ఈ జాబితాలో మరో కమెడియన్ చేరిపోయాడు.
‘పుష్ప’ సినిమా చూసిన వారికి జగదీశ్ ప్రతాప్ (Jagadeesh Prathap) గురించి తెలిసే ఉంటుంది. ఆ చిత్రంతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు. హీరో స్నేహితుడిగా తన కామెడీతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ నటుడు తాజాగా ‘సత్తిగాడి రెండెకరాలు’ (Sathi Gani Rendu Ekaralu) అనే చిత్రంతో హీరోగా మారాడు. ఈ మూవీ మార్చి 17న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ని మూవీ టీం తాజాగా విడుదల చేసింది. (Trailer out)
ఈ ట్రైలర్ చూస్తే.. సత్తిగాడు అనే ఆటో డ్రైవర్‌కి కూతురి గుండె ఆపరేషన్ కోసం రూ.25 లక్షలు కావాల్సి వస్తాయి. తనకి ఉన్న రెండెకరాల పొలాన్ని అమ్మేద్దామని అనుకుంటాను. అదే సమయంలో తన కుటుంబానికి ఆధారమైన అమ్మలేక ఇబ్బంది పడుతుంటాడు. ఓ వైపు కూతురి ప్రాణం, మరో వైపు రెండెకరాల పొలం కాపాడుకోడానికి సత్తిగాడు చేసే ప్రయత్నమే ఈ చిత్ర కథాంశ కావొచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా ట్రైలర్‌లోని కామెడీ అందరినీ ఆకట్టుకుంటోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా.. అభినవ్ రెడ్డి దండా దర్శకత్వం వహంచిన ఈ చిత్రంలో వెన్నెల కిశోర్ (Vennela Kishore), బిత్తిరి సత్తి కీలక పాత్రల్లో నటించారు.
ఇవి కూడా చదవండి:
Sri Devi 2.0: పల్లెటూరి యువతిలా మారిపోయిన జాన్వీ.. చూపు తిప్పుకోలేకపోతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్
OTT Release: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..
Anicka: హీరోయిన్‌ని ముఖం వాచిపోయేలా కొట్టిన మాజీ ప్రియుడు.. అసలు విషయం ఏమిటంటే?
Video Viral: ‘కేజీఎఫ్’ కాంట్రవర్సీ.. సారీ కాని సారీ చెప్పిన వెంకటేశ్ మహా
Kushboo Sundar : కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించాడు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నటి
Manchu Manoj Weds Mounika reddy: ముహూర్తం ఫిక్స్.. అతి కొద్దిమంది సమక్షంలో..
Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరో తెలుసా?