Haarika hassine - Sitara: ఐటీ దాడులు!

ABN , First Publish Date - 2023-01-19T14:29:53+05:30 IST

భారీ చిత్రాల నిర్మాణానికి కేరాఫ్‌గా నిలుస్తున్న టాలీవుడ్‌పై ఈ మఽధ్యకాలంలో ఐటీ శాఖ ఫోకస్‌ పెట్టింది. నెల రోజులుగా అగ్ర నిర్మాణ సంస్థలపై రైడ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే!

Haarika hassine - Sitara: ఐటీ దాడులు!

భారీ చిత్రాల నిర్మాణానికి కేరాఫ్‌గా నిలుస్తున్న టాలీవుడ్‌పై ఈ మధ్యకాలంలో ఐటీ శాఖ (IT rides)ఫోకస్‌ పెట్టింది. నెల రోజులుగా అగ్ర నిర్మాణ సంస్థలపై రైడ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే! గత నెలలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థపై ఐటీ దాడులు జరిగాయి. తాజాగా మరో అగ్ర నిర్మాణ సంస్థ ఈ సమస్యను ఎదుర్కొంది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌(Haarika hassine), సితారా (Sitara entertainments)ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలపై ఐటీ అధికారులు దాడిచేశారు. సంస్థ కార్యాలయాలతోపాటు మై హోమ్‌భుజాలో ఉన్న నిర్మాత నాగవంశీ ఇంటిలో కూడా సోదాలు చేశారని తెలిసింది. ఈ నిర్మాణ సంస్థకు చెందిన కుటుంబ సభ్యుల లాకర్లు కూడా స్కానర్‌లో ఉన్నట్లు సమాచారం. గతంలో కూడా ఈ నిర్మాణ సంస్థపై దాడుల జరిగాయి. దర్శకుడు త్రివిక్రమ్‌కు అత్యంత సన్నిహితుడైన రాధాకృష్ణ హారిక - హాసిని బ్యానర్‌పై అగ్ర హీరోలతో భారీ బడ్జెట్‌ చిత్రాలు నిర్మిస్తున్నారు. తాజాగా మహేష్‌ బాబు(Maheshbabu), త్రివిక్రమ్‌ (Trivikram) కాంబినేషన్‌లో బుధవారం నూతన చిత్రం షూటింగ్‌ మొదలైంది. అదే రోజున ఈ సంస్థలపై ఐటీ దాడుల జరగడం గమనార్హం.

Updated Date - 2023-01-19T14:42:02+05:30 IST