Ileana D'Cruz : ఫొటోతో భావోద్వేగ పోస్ట్!
ABN , First Publish Date - 2023-10-02T14:09:25+05:30 IST
గోవా బ్యూటీ ఇలియానా (Ileana D'Cruz) ఇటీవల పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి కాకుండా ఆమె గర్భం దాల్చడం ఏంటని అంతా షాక్ అయ్యారు. చాలా రోజుల వరకూ తన బిడ్డకు తండ్రి ఎవరనేది చెప్పలేదు.
గోవా బ్యూటీ ఇలియానా (Ileana D'Cruz) ఇటీవల పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి కాకుండా ఆమె గర్భం దాల్చడం ఏంటని అంతా షాక్ అయ్యారు. చాలా రోజుల వరకూ తన బిడ్డకు తండ్రి ఎవరనేది చెప్పలేదు. ఇటీవల తన ప్రియుడి ఫొటో షేర్ చేసింది. ఇలియానా లైఫ్ పార్ట్నర్ పేరు మైఖేల్ డోలాన్. తన కొడుక్కి కోవా ఫోనిక్స్ డోలాన్ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ బిడ్డకు రెండు నెలలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఇలియానా తన బిడ్డ క్యూట్ ఫోటో షేర్ చేసింది. ుఅప్పుడే రెండు నెలలు గడచిపోయాయి అని కామెంట్ కూడా పెట్టింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
'దేవదాసు చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ఇలియానా స్టార్ హీరోలతో అవకాశాలు అందుకుని చక్కని విజయాలు అందుకుంది. లవ్ ఎఫైర్, బ్రేకప్ లాంటి వ్యవహారాలతో ఇలియానాని బాగా డిప్రెషన్‌లోకి తీసుకెళ్లాయి.. డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ సినిమాల కోసం ట్రై చేసింది. అయితే కొంతకాలంగా టాలీవుడ్‌కి దూరమై బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రంతో టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో మళ్లీ ఇలియానా తెలుగులో మరో సినిమాలో కనిపించలేదు. ప్రస్తుతం హిందీలో రెండు చిత్రాలతో బిజీగా ఉంది.