Ileana D'Cruz: మొదటిసారి బేబీ బంప్‌తో!
ABN , First Publish Date - 2023-05-04T16:09:14+05:30 IST
తాను తల్లి కాబోతున్నాను అంటూ గోవా బ్యూటీ ఇలియానా చేసిన పోస్ట్ అభిమానులను షాక్‌కు గురి చేసింది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మరో ఆసక్తికర పోస్ట్ చేసింది
తాను తల్లి కాబోతున్నాను అంటూ గోవా బ్యూటీ ఇలియానా (ileana) చేసిన పోస్ట్ అభిమానులను షాక్‌కు గురి చేసింది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మరో ఆసక్తికర పోస్ట్ చేసింది. మొదటిసారి ఆమె బేబీ బంప్ (ileana baby bump) వీడియోను షేర్ చేసి నెటిజన్లకు మరో అప్‌డేట్ ఇచ్చింది. ఫొటోలు, పోస్ట్‌లతో మినహా స్వయంగా ఆమె ఎక్కడా ఈ విషయం గురించి మాట్లాడలేదు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరనేది కూడా చెప్పలేదు. తాజాగా ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. తన గదిలో బెడ్‌పై వాలుగా పడుకొని కాఫీ తాగుతూ బేబీ బంప్‌ను చూపిస్తూ,, ‘లైఫ్ లేట్లీ’ అని కామెంట్ చేశారు. ఆ వీడిమో క్లిప్ చూస్తుంటే తన ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తోంది తెలుస్తోంది. (Ileana Pregnent)
గతనెల 18న తాను తల్లి కాబోతున్నానంటూ చిన్నారి డ్రెస్‌తో పోస్ట్ చేసి సోషల్ మీడియా వేదికగా తెలిపింది ఇలియానా. తన బిడ్డ కోసం ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నట్టు చెప్పుకొచ్చింది. దాంతో నెటిజన్లు ‘ఇలియానాకు పెళ్లి కాలేదు కదా’ అంటూ ప్రశ్నలు మొదలుపెట్టారు. కనీసం తండ్రెవరో చెప్పమంటూ సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేశారు. అయితే మొదట ఇలియానా పోస్ట్ చూసిన నెటిజన్లు సినిమా ప్రమోషన్ కోసం చేస్తుందేమో అనుకున్నారు. ఇప్పుడు ఇన్‌స్టా స్టోరీలో వీడియోతో క్లారిటీ ఇచ్చేసింది. షార్ట్ ఫ్రాక్ ధరించి బెడ్‌పై విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా వాలుగా పడుకొని తన బేబీ బంప్‌ని చూపిస్తూ చేతిలో కాఫీ మగ్‌తో వీడియో రికార్డ్ చేసింది. అయితే ఇలియానా తల్లి కావడం అనేది చిత్ర పరిశ్రమలో సంచలనగాఆ మారింది. గతంలో ఆమె ఆరేస్టలియా ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్ చేసింది. 2019లో అతడితో బ్రేకప్ అయింది. తర్వాత కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో రిలేషన్‌షిప్‌లో ఉందనే వార్తలు వచ్చాయి. అప్పట్లో వీరిద్దరూ కలిసి తిరిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇలియానా తనతో రిలేషన్ స్టేటస్ గురించి ఎలాంటి సమాచారంలేదు. ‘‘దేవదాసు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఇలియానా టాలీవుడ్‌లో అగ్ర హీరోలు అందరితో పని చేసింది. తదుపరి బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది.