Ilaiyaraaja - Sudhakar: మూగబోయిన వేణువు.. సుధాకర్ ఇకలేరు!
ABN , First Publish Date - 2023-03-28T17:03:13+05:30 IST
మాస్ట్రో ఇళయరాజా (Maestro Ilaiyaraaja) సంగీత సారథ్యంలో తమిళనాట ఎన్నో చిత్రాలకు, విజయవంతమైన పాటలకు వేణుగాన విధ్వాంసుడిగా పని చేసిన సుధాకర్ (Flautist Sudhakar) ఇక లేరు.
మాస్ట్రో ఇళయరాజా (Maestro Ilaiyaraaja) సంగీత సారథ్యంలో తమిళనాట ఎన్నో చిత్రాలకు, విజయవంతమైన పాటలకు వేణుగాన విధ్వాంసుడిగా పని చేసిన సుధాకర్ (Flautist Sudhakar) ఇక లేరు. మంగళవారం ఆయన చెన్నైలో కన్ను మూశారు. ఇళయరాజా స్వరాలకు తగ్గట్లు తన వేణువుతో ఎన్నో మ్యాజిక్‌లు (musical Hits) చేసి హిట్ పాటలను అందించారు. ‘కవి కుయిల్’లో ‘చిన్నకన్నన్ అళైక్కిరణ్’, ‘పయనంగళ్ ముదివతిల్లై’లో ఇళయని పొళిగిరతే, ‘ఉతిరిపూకళి కలైవా పుతులైగ్‌లోని ‘అళగియా కన్నె ఉరవుగళ్ నీయే’, పుత్తమ్ పుతులైగ్‌లో అళైగయా కన్నెయ్ ఉరవుగళ్ నీయే’ వంటి తమిళ సినిమా సినిమాలకు లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ ఇళయరాజాతో కలిసి మ్యాజిక్ సృష్టించిన ఫ్లూటిస్ట్ సుధాకర్. ఇళయరాజా, తమిళ సినీ పరిశ్రమ సుధాకర్ మరణం పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. నంజప్ప- గుణసింగ్ వంటి ప్రముఖ ఫ్లూటిస్టులతో సుధాకర్ పోటీ పడేవారని, వారిని డామినేట్ చేసేలా వేణువు వాయుంచేవారని ఈ విద్యలో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకున్నారని ఇళయరాజా చెబుతుంటారు. ఆయనతో కలిసి పని చేసిన గిటారిస్ట్ సదానందం సుధాకర్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ‘‘ప్రేక్షకుల మదిలో ఇప్పటికీ ఉన్న ఎన్నో పాటలకు మేం కలిసి పని చేశాం. అతని వేణువులో టోనల్ క్వాలిటీ అత్యద్భుతంగా ఉండేది. వేణువుతోపాటు పాశ్చాత్య సంగీత వాయిద్యమైన రికార్డర్‌ను కూడా ఆయన వాయించారు. దాని ప్రభావం ‘అళగియ కన్నేయ్ ఉరవగల్ నీయే’ పాటలో కనిపిస్తుందని గిటారిస్ట్ సదానందం గుర్తు చేసుకున్నారు.
‘‘ఇతర సంగీత కళాకారులు మాదిరిగా తాను నోట్స్ చదవలేనని, జ్ఞాపకశక్తితో ప్రతిదీ ప్లే చేయలేనని సుధాకర్ స్వయంగా ఇళయరాజాకు చెప్పారు. అతనికి ఈ వైకల్యం ఉన్నప్పటికీ అతని పరిపూర్ణ ప్రతిభ కారణంగా అతనిని తన ప్రధాన ఫ్లూటిస్ట్‌గా ఇళయరాజా పెట్టుకున్నారని సదానందం అన్నారు.