Varun Tej: ప్రియురాలు లావణ్యకి మొట్ట మొదట గిఫ్ట్ ఏంటి అని అడిగితే.... షాకింగ్ సమాధానం...
ABN , First Publish Date - 2023-08-23T10:13:17+05:30 IST
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్మెంట్ కొన్ని నెలల క్రితం అయిన సంగతి అందరికి తెలిసిన విషయమే. వరుణ్ తేజ్ తన 'గాండీవదారి అర్జున' చిత్రం ప్రచారంలో భాగంగా ఒక టీవీ షో లో తనకి, లావణ్య కి మధ్య జరిగిన వాటి మీద ఆసక్తికర సమాధానాలు చెప్పాడు.
వరుణ్ తేజ్ (VarunTej) సినిమా 'గాండీవధారి అర్జున' #GandeevadhariArjun ఈ శుక్రవారం విడుదలవుతోంది. ప్రవీణ్ సత్తారు (PraveenSattaru) దీనికి దర్శకుడు, సాక్షి వైద్య (SakshiVaidya) కథానాయనకురాలు. ఈ చిత్ర యూనిట్ ఇప్పుడు ప్రచారాలు విరివిగా చేస్తోంది. అందులో భాగంగానే కనకాల సుమ (SumaKanakala) హోస్ట్ గా వస్తున్న సుమ అడ్డా #SumaAdda అనే షోకి వరుణ్ తేజ్, సాక్షి వైద్య, ప్రవీణ్ సత్తారు వచ్చారు. ఈ షో ప్రోమో విడుదలైంది, ఇందులో వరుణ్ తేజ్, లావణ్య (LavanyaTripathi) గురించి కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు చాలా ఆసక్తికర సమాధానాలు వచ్చాయి.
వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి కి కొన్ని నెలల క్రితం ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే. వాళ్ళిద్దరి ప్రేమ పెళ్లి వరకు వచ్చింది, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అన్నది కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి లావణ్య త్రిపాఠి నెంబర్ తన మొబైల్ లో ఏమని సేవ్ చేసుకున్నాడు అని ఒకరు అడిగితే, 'లవ్' (Lav) అని చెప్పాడు. లావణ్య తన ఫోన్ తీసుకొని ఆమే ఆలా సేవ్ చేసింది అని చెప్పాడు వరుణ్ తేజ్.
అయితే ఇంకొకరు లావణ్య త్రిపాఠి కి ఇచ్చిన మొట్ట మొదటి గిఫ్ట్ ఏంటో గుర్తుందా అని అడిగితే, వరుణ్ తేజ్ 'లేదు, చాలా సంవత్సరాలు అయింది కదా' అని సమాధానం చెప్పాడు. అయితే వెంటనే సుమ 'మాకు ఇప్పుడే తెలిసింది కదా' అని కౌంటర్ వేసింది. ఇదే ప్రోమోలో నిర్మాత అల్లు అరవింద్ ఒక ఫంక్షన్ లో లావణ్య త్రిపాఠి తో నువ్వు ఎవరినైనా ఇక్కడి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపో అన్న వీడియో చూపించారు. అలాగే వరుణ్ తేజ్ చిన్నప్పటి ఫోటోస్ కూడా చాలా చూపించి వాటి గురించి అడిగారు.