Himaja : ఇంట్లోనే ఉన్నా.. పోలీస్‌ స్టేషన్లో కాదు..

ABN , First Publish Date - 2023-11-12T15:28:21+05:30 IST

నటి, బిగ్‌బాస్‌ ఫేం హిమజ (himja) అరెస్ట్‌ అంటూ వచ్చిన రూమర్లను ఆమె ఖండించింది. తన ఇంట్లో రేవ్‌ పార్టీ ఏర్పాటు చేసిందని వచ్చిన వార్తలో నిజం లేదని చెబుతూ లైవ్‌ వీడియో చేసింది. హిమజ కొత్తగా కట్టుకున్న డ్రీమ్‌హౌస్‌లో ఇటీవల అడుగుపెట్టింది

Himaja : ఇంట్లోనే ఉన్నా.. పోలీస్‌ స్టేషన్లో కాదు..



నటి, బిగ్‌బాస్‌ ఫేం హిమజ (himja) అరెస్ట్‌ అంటూ వచ్చిన రూమర్లను ఆమె ఖండించింది. తన ఇంట్లో రేవ్‌ పార్టీ ఏర్పాటు చేసిందని వచ్చిన వార్తలో నిజం లేదని చెబుతూ లైవ్‌ వీడియో చేసింది. హిమజ కొత్తగా కట్టుకున్న డ్రీమ్‌హౌస్‌లో ఇటీవల అడుగుపెట్టింది.ఆ ఇంట్లో రేవ్‌ పార్టీ ఏర్పాటు చేసిందని, ఫిర్యాదు మేరకు  పోలీస్‌లు అరెస్ట్‌ చేశారని రూమర్లు చక్కర్లు కొట్టాయి. దీనిపై హిమజ క్లారిటీ ఇచ్చింది. కొత్త ఇంట్లో దీపావళి సెలబ్రేట్‌ చేసుకుంటున్నానని, లక్ష్మీ పూజకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నానని తెలిపింది. ఈ మేరకు ఓ వీడియో షేర్‌ చేసింది. (Tollywood acress)

ఆమె మాట్లాడుతూ ''నేను చాలా హ్యాపీగా దీపావళి పండుగను సెలబ్రేట్‌ చేసుకుంటున్నా. కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత మొదటి దీపావళి అని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను పిలుచుకుని లక్ష్మీ పూజ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నా. ఇల్లంతా చుట్టాలతో సందడిగా ఉంది. ఈ తరుణంలో ఎవరో నా ఇంట్లో రేవ్‌ పార్టీ ఏర్పాటు చేశానని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డిపార్ట్‌మెంట్‌వాళ్లు వచ్చి చెక్‌ చేసుకున్నారు. ఎలక్షన్ కోడ్  కూడా ఉంది కాబట్టి వారి డ్యూటీ వాళ్లు చేశారు. మేమంత పోలీసులకు సహకరించాము. దీనిని పలు ఛానళ్లు, న్యూస్‌ యాప్స్‌ రేవ్‌ పార్టీ అంటూ నా గురించి చెడ్డగా ప్రచారం చేశారు. ఈ విషయాన్ని టీవీలో చూసి మా బంధువులు, సన్నిహితుల నుంచి ఫోన్లు వస్తున్నాయి. నా గురించి తప్పుడు ప్రచారం చేసిన వారికోసం ఈ వీడియో చేసి పోస్ట్‌ చేశాను. పూజ చేసుకోవలసిన సమయంలో 'నేను ఇంట్లోనే ఉన్నాను.. పోలీస్‌ స్టేషన్లో లేను’ అని చెప్పే పరిస్థితికి తీసుకొచ్చారు. ఫేక్‌ న్యూస్‌ ఎవరు స్ప్రెడ్  చేశారో తెలీదు కానీ అవన్నీ నమ్మవద్దు" అని చెప్పడానికే నేనీ వీడియో షేర్‌ చేస్తున్నా’’ అని హిమజ వీడియోలో పేర్కొన్నారు. పూజకు సిద్ధం చేస్తున్న విజువల్స్‌ని ఆమె షేర్‌ చేసింది.






Updated Date - 2023-11-12T15:28:22+05:30 IST