Suman: అలా చేస్తే.. అన్ని భాషల సినిమా వాళ్లు ఆంధ్రా వైపు చూస్తారు

ABN , First Publish Date - 2023-11-10T18:19:15+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయని, తక్కువ ఖర్చులో షూటింగ్ అవుతుందన్న నమ్మకాన్ని ప్రభుత్వం కనుక కల్పిస్తే.. అన్ని భాషల సినిమా వాళ్లు ఆంధ్రా వైపు చూస్తారని హీరో సుమన్ అన్నారు. తాజాగా ఆయన విజయవాడలో ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సొంత ఆఫీస్‌ను ప్రారంభించారు.

Suman: అలా చేస్తే.. అన్ని భాషల సినిమా వాళ్లు ఆంధ్రా వైపు చూస్తారు
AP Film Chamber of Commerce New Building Launch

ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయని, తక్కువ ఖర్చులో షూటింగ్ అవుతుందన్న నమ్మకాన్ని ప్రభుత్వం కనుక కల్పిస్తే.. అన్ని భాషల సినిమా వాళ్లు ఆంధ్రా వైపు చూస్తారని హీరో సుమన్ అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఫిలిం ఛాంబర్ ఉండాలన్న ఉద్దేశ్యంతో ప్రారంభించబడి, కేవలం 5 వేల రూపాయలతో సభ్యులకు మెంబర్షిప్ ఇస్తూ సినీ పరిశ్రమ సభ్యుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (AP Film Chamber of Commerce). ఇప్పటి వరకు సొంత ఆఫీస్ లేని ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు తాజాగా విజయవాడ (Vijayawada) తాడేపల్లిలో ఓ ఫ్లాట్‌ని కొనుగోలు సొంత ఆఫీస్‌ని సిద్ధం చేశారు. ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సొంత ఆఫీస్‌ను హీరో సుమన్ (Hero Suman) ప్రారంభించారు. ఈ ఆఫీస్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ఆఫీస్ ప్రాంగణంలో సంస్థ సభ్యులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఛాంబర్ అధ్యక్షులు మధుమోహన్ కృష్ణ (Madhu Mohan Krishna), జనరల్ సెక్రటరీ మోహన్ గౌడ్ (Mohan Goud), ఉపాధ్యక్షులు వీస్ విజయ్ వర్మ పాకలపాటి (Vs.Varma Pakalapati), జాయింట్ సెక్రటరీ చైతన్య జంగా (Chaitanya Janga) పాల్గొన్న ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరో సుమన్ మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయని, ఇక్కడ తక్కువ ఖర్చులో షూటింగ్ అవుతుందన్న నమ్మకాన్ని ప్రభుత్వం కల్పిస్తే, అన్ని భాషల చిత్ర నిర్మాణ సంస్థలు ఆంధ్రా వైపు చూస్తాయని, ఈ దిశగా మధు, గౌడ్, వర్మ మరియు చైతన్య కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా’’నని అన్నారు.


Suman-1.jpg

అనంతరం చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌లో స్థిరపడేలా తమ ఛాంబర్ కృషి చేస్తుందని అధ్యక్ష కార్యదర్శులు మధుమోహన్ కృష్ణ, మోహన్ గౌడ్‌లు పేర్కొన్నారు. స్టూడియో నిర్మాణానికి మరియు నటులు, సాంకేతిక నిపుణులు మరియు ఫిలిం ఎంప్లాయిస్‌కి స్థలాలు ఇవ్వడం, చిత్ర నిర్మాణానికి ఉత్తరాఖండ్, ఝార్ఖండ్ తరహాలో ప్రోత్సాహం అందించడం ద్వారా హైదరాబాద్‌కి సమాంతరంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ (Tollywood) ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో వేళ్ళూనుకుంటుందని ఉపాధ్యక్షులు వీస్ విజయ్ వర్మ పాకలపాటి, సంయుక్త కార్యదర్శి చైతన్య జంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


ఇవి కూడా చదవండి:

========================

*Trisha: మెగాస్టార్ చిరంజీవి బాటలో ‘త్రిష’ చిత్రం..

************************************

*Kannappa: ‘కన్నప్ప’కు అదే కరెక్ట్ అంటోన్న మంచు విష్ణు

*************************************

*NBK109: బాలయ్య మరో మాస్ రాంపేజ్ అప్‌డేట్.. పిక్ అదిరింది

*************************************

Updated Date - 2023-11-10T19:56:43+05:30 IST