Hanu-Man: సూపర్ హీరో సాంగ్‌తో ‘హనుమాన్’.. మొత్తానికి మొదలెట్టారు

ABN , First Publish Date - 2023-11-14T21:25:05+05:30 IST

సూపర్ హీరో సినిమాలంటే మ‌నోళ్ల‌కు తెగ పిచ్చి. అయితే ఇండియన్ ఫ్యాన్స్ మన సూపర్ హీరో హను-మాన్‌ని తెరపై చూడటానికి సిద్ధం కావాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. తేజ సజ్జ లీడ్ రోల్ లో ప్రశాంత్ వర్మ రూపొందించిన ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో 'హను-మాన్ ' సాహసాలను మ‌రో రెండు నెలల్లో ప్రేక్షకులు చూసేయ‌వ‌చ్చు.

Hanu-Man: సూపర్ హీరో సాంగ్‌తో ‘హనుమాన్’.. మొత్తానికి మొదలెట్టారు
hanu man

సూపర్ హీరో సినిమాలంటే మ‌నోళ్ల‌కు తెగ పిచ్చి. అయితే ఇండియన్ ఫ్యాన్స్ మన సూపర్ హీరో హను-మాన్‌ని తెరపై చూడటానికి సిద్ధం కావాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. తేజ సజ్జ లీడ్ రోల్ లో ప్రశాంత్ వర్మ రూపొందించిన ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో 'హను-మాన్ ' సాహసాలను మ‌రో రెండు నెలల్లో ప్రేక్షకులు చూసేయ‌వ‌చ్చు. యూనిక్ కాన్సెప్ట్‌లతో ఒరిజినల్ సినిమాలు తీయడమే కాకుండా ప్రమోషన్స్‌లోనూ తనదైన ప్రత్యేకతను చైప‌డంలో ప్రశాంత్ వర్మ స్పెషాలిటీ. గ‌తంలో వ‌చ్చిన‌ టీజర్, హనుమాన్ చాలీసా పాటకు అద్భుతమైన స్పందన రావడంతో ఆయ‌న‌, మూవీ టీమ్ సినిమాపై మరింత కేర్ తీసుకుంటున్నారు.

ఈ చిత్రంలో తేజ సరసన అమృతా అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా, వినయ్ రాయ్ విలన్‌గా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మొదటి సినిమా హను-మాన్. ఈ సినిమా కాన్సెప్ట్ యూనివర్సల్‌గా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా మంచి విజయం సాధించే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ సినిమాను జనవరి 12, 2024న తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్‌ విడుదల కానుంది.


అయితే ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్‌తోనే సూపర్ హీరో హనుమాన్‌ని లాంచ్ చేయడానికి టీమ్ చిల్డ్రన్స్ డే సందర్భాన్ని ఎంచుకోవ‌డంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. పాట చూసిన తర్వాత అందరికీ ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. ఈ పాట కోసం అనుదీప్ దేవ్ పెక్యులర్ నెంబర్ ని కంపోజ్ చేయ‌గా వాగ్దేవి, ప్రకృతి, మయూఖ్ అలపించారు. కృష్ణకాంత్ రాసిన సాహిత్యం కంప్లీట్ కామికల్ గా ఆకట్టుకుంది. ఒరిజినల్ విజువల్స్‌తో చేసిన‌ కామికల్ నెరేషన్ పిల్లలను ఆకర్షించింది. నిజానికి, పిల్లలు మన సూపర్ హీరో హనుమంతు సూపర్ పవర్‌లను చూడటానికి ఇష్టపడతారు. ఈ సూపర్ ఆంథమ్‌ ఇన్స్టెంట్ హిట్, ఈ బాలల దినోత్సవం సందర్భంగా పిల్లల కోసం బెస్ట్ ప్రజంటేషన్.

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ త్రయం సంగీతం అందించగా, శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ మాగ్నమ్ ఓపస్‌కి సినిమాటోగ్రఫీ శివేంద్ర. ప్రొడక్షన్ డిజైనర్ శ్రీనాగేంద్ర తంగాల వ్య‌వ‌హ‌రించారు.

Updated Date - 2023-11-14T21:25:57+05:30 IST