Hansika : హన్సిక పాత్ర ఎలా ఉండబోతోదంటే...
ABN , First Publish Date - 2023-09-29T16:19:27+05:30 IST
దేశముదురు సినిమాతో తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసిన హన్సిక అతి తక్కువ సమయంలో అగ్రకథానాయికగా గుర్తింపును సొంతం చేసుకుంది. పలు సూపర్ హిట్ చిత్రాల్లో నాయికగా నటించిన ఆమె కథానాయికగా నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం మై నేమ్ ఈజ్ శృతి .
దేశముదురు సినిమాతో తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసిన హన్సిక అతి తక్కువ సమయంలో అగ్రకథానాయికగా గుర్తింపును సొంతం చేసుకుంది. పలు సూపర్ హిట్ చిత్రాల్లో నాయికగా నటించిన ఆమె కథానాయికగా నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం మై నేమ్ ఈజ్ శృతి . శ్రీనివాస్ ఓంకార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మిస్తున్నారు. నిర్మాణానంతర పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి పోరాటం పోరాటం.. అనే లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్రయూనిట్.
దర్శకుడు మాట్లాడుతూ కష్ణకాంత్ రచించిన ఈ పాటకు మార్కె కె రోబిన్ సంగీతం అందించగా, రాహుల్ సిప్లిగంజ్, హారిక నారాయణన్, సత్య యామిని ఆలపించారు. ఇప్పటి వరకు రానటువంటి ఓ విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. సినిమాలో వుండే ట్విస్ట్ లు అందరిని కట్టిపడేస్తాయి. చివరి వరకు ఎవరి ఊహకందని కథాంశమిది. తప్పకుండా చిత్రం అన్ని వర్గాల వారిని అలరిస్తుందనే నమ్మకం వుంది‘ అన్నారు.
త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని, కొత్తదనం కోరుకునే ప్రతి ఒక్కరికి మా చిత్రం తప్పకుండా నచ్చుతుందని నిర్మాత తెలిపారు.
హన్సిక మాట్లాడుతూ శృతి అనే యువతిగా ఈ సినిమాలో కనిపిస్తా. తన భావాల్ని ధైర్యంగా వెల్లడించే యువతిగా విభిన్నంగా నా పాత్ర ఉంటుంది. ఆద్యంతం మలుపులతో ఆసక్తికరంగా సినిమా సాగుతుంది. కథ వింటున్నప్పుడు తర్వాత ఏం జరుగుతుందనే ముగింపు వరకు నేను ఊహించలేకపోయాను అన్నారు.