Hai Nanna : ఫ్రెండ్స్‌ అయితే హగ్‌ చేసుకుంటారు.. కిస్‌ పెడతారు!

ABN , First Publish Date - 2023-10-15T15:41:54+05:30 IST

నాని(Nani) కథానాయకుడిగా నటిస్తున్న ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌ ‘హాయ్‌ నాన్న’(Hai nanna). మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal thakur) కథానాయిక. బేబీ కియారా ఖన్నా, శ్రుతిహాసన్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో నాని తండ్రి పాత్ర పోషించారు.

Hai Nanna : ఫ్రెండ్స్‌ అయితే హగ్‌ చేసుకుంటారు.. కిస్‌ పెడతారు!

నాని(Nani) కథానాయకుడిగా నటిస్తున్న ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌ ‘హాయ్‌ నాన్న’(Hai nanna). మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal thakur) కథానాయిక. బేబీ కియారా ఖన్నా, శ్రుతిహాసన్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో నాని తండ్రి పాత్ర పోషించారు. శౌర్యువ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తండ్రీ కుమార్తెల సెంటిమెంట్‌తో రూపుదిద్దుకుంటోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

Untitled-1.gif

సాఫీగా, సరదాగా సాగుతున్న తండ్రీ కూతుళ్ల జీవితంలోకి ఓ యువతి రావడం అతనితో ప్రేమలోపడటం.. వంటి సన్నివేశాలు టీజర్‌లో చూపించారు., కియారా ఖన్నా క్యూట్‌ మాటలు ఎంతగానో అలరించేలా ఉన్నాయి. అయితే కూతురిని పెట్టుకుని అతను ఆమె ప్రేమను అంగీకరించాడా? కుమార్తె కోసం ఏం చేశాడు? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా రూపొందినట్లు టీజర్‌లో బ్రీఫ్‌గా చెప్పారు. పాన ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చెరుకూరి మోహన, డా. విజయేందర్‌ రెడ్డి తీగల నిర్మించారు. డిసెంబర్‌ 7న తెలుగు, తమిళ, మలయాళ కన్నడ, హిందీ భాషల్లో చిత్రం విడుదల కానుంది.

Updated Date - 2023-10-15T15:41:54+05:30 IST