Gunasekhar: అప్పుడు కుదరదు అన్నారు.. ఇప్పుడు నేనే చేస్తానన్నారు!

ABN , First Publish Date - 2023-04-01T17:11:42+05:30 IST

గతంలో ఓ పాత్ర కోసం కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబును(Mohan babu) సంప్రదిస్తే ఆయన సున్నితంగా తిరస్కరించారని దర్శకుడు గుణశేఖర్‌ (Gunasekhar) చెప్పారు.

Gunasekhar: అప్పుడు కుదరదు అన్నారు.. ఇప్పుడు నేనే చేస్తానన్నారు!

గతంలో ఓ పాత్ర కోసం కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబును(Mohan babu) సంప్రదిస్తే ఆయన సున్నితంగా తిరస్కరించారని దర్శకుడు గుణశేఖర్‌ (Gunasekhar) చెప్పారు. తాజాగా ఆయన దర్శకత్వంలో సమంత టైటిల్‌ పాత్ర పోషించిన ‘శాకుంతలం’ ఈ నెల 14న విడుదల కానున్న నేపథ్యంలో ఆయన ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇందులో దుర్వాస మహర్షి పాత్ర కోసం మోహన్‌బాబును ఎంచుకోవడంపై గుణశేఖర్‌ తాజా ఇంటర్వ్యూలో స్పందించారు.

‘‘శాకుంతలం’ చిత్రానికి మోహన్‌బాబు (Mohanbabu As Durvasa muni) నా ఛాయిస్‌ కాదు. మహాకవి కాళిదాసు ఛాయిస్‌ ఎందుకంటే కాళిదాసు వర్ణన చదివిన తర్వాత.. దుర్వాస మహర్షి పాత్రకు నూటికి నూరు శాతం ఆయనే న్యాయం చేయగలరని అనిపించింది. ‘రుద్రమదేవి’లో ఓ కీలక పాత్ర చేయమని అడిగాను. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారు(Mohanbabu rejected Rudramadevi). నేను బలవంతం చేయలేదు. శాకుంతలం కథ అనుకున్నాక ఆయన్ని కలిశాను. ‘సర్‌.. ఈసారి మీరు కాదనలేని పాత్రతో వచ్చాను. ఒకవేళ మీరు నో అంటే ఆప్షన్‌ కూడా మీరే చెప్పండి అని అడిగాను. తదుపరి ఆయన కథ, పాత్ర గురించి అడిగారు. ‘శాకుంతలం’లో దుర్వాస మహర్షి పాత్ర అని చెప్పగానే.. ఆయన పెద్దగా నవ్వి.. ‘కోపిష్టి అని నా వద్దకు వచ్చావా?’ అని అడిగారు. దుర్వాసునిలో కోపం ఒక్కటే గుణం కాదు.. ఆయనో గొప్ప మహర్షి అని సమాధానమిచ్చా. ఆయన వెంటనే ఆ పాత్ర నేనే చేస్తానని మాటిచ్చారు. అలా ఆయన ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు" అని అన్నారు .

3.jpg

గుణశేఖర్‌ దర్శకత్వంలో సమంత కీలక పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని నీలిమా గుణ నిర్మించారు. దిల్‌ రాజు సమర్పించారు. ఈ నెల 14న ప్యాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదలకానుంది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

1.jpg

Updated Date - 2023-04-01T17:19:24+05:30 IST