JrNTR: అమెరికాలో అభిమానులతో ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు
ABN , First Publish Date - 2023-03-07T13:44:46+05:30 IST
జూనియర్ ఎన్టీఆర్ అమెరికా లో అడుగుపెట్టిన దగ్గరనుండి సందడి మొదలయింది. అభిమానులను కలవటం, వాళ్ళతో ఫోటోలకు పోజులివ్వటం, వీధుల్లో అభిమానులు ఇస్తున్న పుష్పగుచ్చాలు అందుకోవటం ఒకటేమిటి ఎక్కడ చూసిన ఎన్టీఆర్ కనపడుతున్నాడు.
'ఆర్.ఆర్.ఆర్' (RRR) సినిమా ఆస్కార్ (Oscar Award) బరిలో వుంది, అందుకని నిన్న జూనియర్ ఎన్టీఆర్ (JrNTR) హైదరాబాద్ నుండి అమెరికా లో ల్యాండ్ అయ్యాడు. అమెరికాలో అడుగుపెట్టిన దగ్గర నుండి అభిమానులతో సందడి చేస్తున్నాడు ఎన్టీఆర్. చాలామంది అభిమానులు ఎన్టీఆర్ దగ్గరకి వచ్చి 'జై ఎన్టీఆర్' (JaiNTR) అని స్లోగన్స్ ఇచ్చారు. అభిమానులతో తన అనుభవాలను పంచుకున్నాడు ఎన్ఠీఆర్. "నేను మీ ఋణం తీర్చుకోలేను. మీరు నా మీద చూపిస్తున్న ఈ 'ప్రేమ' ని ఎన్నటికీ మరువలేను. మళ్ళీ జన్మ అంటూ ఉంటే మీలాంటి అభిమానులను పొందడానికి ఇలాగె పుట్టాలని కోరుకుంటున్నాను," అని చెప్పాడు ఎన్టీఆర్.
ఆ తరువాత మీకు నేను ఏమిచ్చినా ఋణం తీరదు. "అందుకని మీ అందరికి శిరస్సు వంచి పాదాభివండం చేస్తున్నాను" అని చెప్పగానే, అభిమానులు అందరూ 'జై ఎన్టీఆర్' అంటూ స్లోగల్స్ ఇచ్చి, నువ్వు మాకు బ్రదర్ లాంటివాడివి అన్నారు. #NTRGoesGlobal
వెంటనే ఎన్టీఆర్ కూడా అవును మీ అందరూ బ్రదర్స్ అని చెప్పాడు. ఆ తరువాత ఎన్టీఆర్ అభిమానాలు అందరినీ కలిసి, అమెరికా లో కూడా తన పాపులారిటీ ఈమాత్రం తగ్గలేదు, ఇంకా పెరిగింది అని చెప్పకనే చెప్పాడు. 'ఆర్.ఆర్.ఆర్' తరువాత ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ (Global Star) అయిపోయాడని, అతని పేరు తెలియని తెలుగు వాడే కాదు, ఇతర భాషల వాళ్ళు కూడా అతని అభిమానులు అయిపోయారని చెప్తున్నారు. #ManofmassesNTR
ఒక టి.షర్ట్ వేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఆ షర్ట్ వెనకాల పులి బొమ్మ ఉండటం యాదృచ్చికం కాదేమో. ఎందుకంటే ఎన్టీఆర్ ని అందరూ యంగ్ టైగర్ అని అంటూ వుంటారు కదా, అందుకేనేమో పులి బొమ్మ వున్న షర్ట్ వేసుకొని ఫోటో సాంఘీక మాధ్యమాల్లో పెట్టాడు. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం చేసిన ట్రిపిల్ ఆర్ నుండి 'నాటు నాటు' (Naatu Naatu song) పాట ఆస్కార్ రేస్ లో వుంది. అలాగే ఈ సినిమా కూడా వుంది.
ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ 30వ (NTR30) సినిమా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వం లో ఈనెలలోనే మొదలవుతుందని చెప్పారు. ఇందులో జాన్వీ కపూర్ (Jahnvi Kapoor) కథానాయికగా నిన్న అంటే మార్చి 6 వ తేదీన ఆమె పుట్టిన రోజు సందర్భంగా ప్రకటించారు.