RRR- Golden Tomoto: మరో అరుదైన గౌరవం... ఆ జాబితాలో 12వ స్థానంలో!

ABN , First Publish Date - 2023-03-09T18:10:31+05:30 IST

95వ ఆస్కార్‌ పురస్కారాల్లో నామినేషన్‌ దక్కించుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి మరో గౌరవం దక్కింది.

RRR- Golden Tomoto: మరో అరుదైన గౌరవం... ఆ జాబితాలో 12వ స్థానంలో!

95వ ఆస్కార్‌ పురస్కారాల్లో నామినేషన్‌ దక్కించుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రానికి మరో గౌరవం దక్కింది. సినిమాలపై సమీక్షలు ఇచ్చే వెబ్‌సైట్‌ ‘రోటెన్‌ టొమాటోస్‌’ తాజాగా విడుదల చేసిన ఉత్తమ 100 చిత్రాల జాబితాలోనూ చోటు సంపాదించుకుంది. మూడు గంటలు, అంతకుమించి ఎక్కువ నిడివి ఉన్న అత్యుత్తమ చిత్రాలను ఎంపిక చేసి ‘రోటెన్‌ టొమాటోస్‌’ (Rotten Tomatoes) జాబితాను విడుదల చేసింది. ఇందులో 1954లో వచ్చిన అడ్వెంచర్‌ మూవీ ‘సెవెన్‌ సమురాయ్‌’ టాప్‌-1లో నిలిచింది. వీటిలో పాటు, ‘షిండ్లర్స్‌ లిస్ట్‌’(5), ‘ది గాడ్‌ఫాదర్‌2’(8), లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌: ది రిటర్న్‌ ఆఫ్‌ కింగ్‌ (23), ‘అపోకలిప్సి నౌ’ (24) వంటి ఆసక్తికర చిత్రాలున్నాయి. మూడు గంటలు, అంతకు మించి అంతకన్నా ఎక్కువ నిడివి గల నాలుగు భారతీయ నేపథ్యమున్న చిత్రాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. వాటిలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ 12వ (RRR in 12 position) స్థ్థానంలో నిలిచింది. ‘‘అభిమానులు ఆసక్తి, అభిరుచి ఓటింగ్‌ను బట్టి ‘రోటెన్‌ టమోటోస్‌’ జాబితాను విడుదల చేస్తుంది. 2022లో విడుదలైన చిత్రాలో ఫ్యాన్స్‌ ఫేవరెట్‌ మూవీ కేటగిరీలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గోల్డెన్‌ టమోటో’ అవార్డుకు అర్హత దక్కించుకుంది’’ అని ‘రోటెన్‌ టమోటోస్‌’ ట్విట్టర్‌ వేదికగా పేర్కొంది. ఇంకా ఈ జాబితాలో ఆమిర్‌ఖాన్‌-అషుతోష్‌ గోవారికర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘లగాన్‌’ (13), ఆస్కార్‌ విజేత ‘గాంధీ (32), అనురాగ్‌ కశ్యప్‌ యాక్షన్‌ డ్రామా ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాేసపుర్‌ (70) ఈ జాబితాలో ఉన్నాయి. టాప్‌-10 చిత్రాల జాబితా విషయానికొస్తే ‘సెవెన్‌ సమురాయ్‌’ (1954), ఫ్యాన్నీ అండ్‌ అలెగ్జాండర్‌ (1982), సిండ్లర్స్‌ లిస్ట్‌ (1993), ది లెపార్డ్‌ (1963), చిల్డ్రన్‌ ఆఫ్‌ ్క్ష?రడైజ్‌ (1945), ది గాడ్‌ ఫాదర్‌ పార్ట్‌-2 (1974), ది రైట్‌ స్టఫ్‌ (1983), మేడ్‌ ఇన్‌ అమెరికా(2006), ది లాస్ట్‌ ఆఫ్‌ ది అన్‌జస్ట్‌ (2013), ఉడ్‌ల్యాండ్స్‌ డార్క్‌ అండ్‌ డేస్‌ బివిచ్డ్‌: ఏ హిస్టరీ ఆఫ్‌ ఫోక్‌ హారర్‌ (2021) చిత్రాలు ఉన్నాయి. (Golden Tomoto award for RRR)

Updated Date - 2023-03-10T13:46:31+05:30 IST