Naatu Naatu: అప్పుడు దక్షిణ కొరియా.. ఇప్పుడు జర్మనీ.. నెక్ట్స్ ఎవరు..?
ABN , First Publish Date - 2023-03-19T17:33:56+05:30 IST
‘ఆర్ఆర్ఆర్’ లోని ‘నాటు నాటు’ (Naatu Naatu) ఆస్కార్ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డును అందుకుంది. ఈ నేపథ్యంలో భారత్‌లో జర్మన్ రాయబారి ఫిలిఫ్ అకర్మన్ (Philipp Ackermann) సంతోషాన్ని వ్యక్తం చేశారు.
‘ఆర్ఆర్ఆర్’ లోని ‘నాటు నాటు’ (Naatu Naatu) ఆస్కార్ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డును అందుకుంది. ఈ నేపథ్యంలో భారత్‌లో జర్మన్ రాయబారి ఫిలిఫ్ అకర్మన్ (Philipp Ackermann) సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘నాటు నాటు’ కు పాత ఢిల్లీలో స్టెప్పులేశారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
జర్మనీ రాయబారి ఫిలిఫ్ అకర్మన్ ట్విటర్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. ‘‘జర్మన్స్ డ్యాన్స్ చేయలేరా..? నేను, నా ఇండో-జర్మన్ బృంద సభ్యులు ‘నాటు నాటు’ విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నాం. పాత ఢిల్లీలో పాటకు స్టెప్పులేశాం. ఒరిజినల్‌కు దూరంగా స్టెప్పులేయొచ్చు. కానీ, ఫన్‌గా ఉంది. మాకు స్ఫూర్తిగా నిలిచినందుకు కొరియన్ ఎంబసీకి కృతజ్ఞతలు. రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కు ఇండియాకు స్వాగతం. ఎంబసీ ఛాలెంజిని ఒపెన్‌గా ఉంచుతుంది. నెక్ట్స్ ఎవరు..?’’ అని ఫిలిఫ్ అకర్మన్ చెప్పారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో.. ఫిలిఫ్ రిక్షాలో చాందినీ చౌక్‌కు వచ్చి ఓ దుకాణదారుడిని అడిగారు. ‘‘ఇది భారతదేశానికి ప్రపంచ ప్రసిద్ధా..?’’ అని అడిగారు. అప్పుడు దుకాణ యజమాని ప్లేట్ జిలేబీతో పాటు బ్యాటన్‌ను అందించారు. బ్యాటన్‌పై దక్షిణ కొరియా జెండాతో పాటు ‘నాటు నాటు’ ప్రింటింగ్ ఉంది. బ్యాటన్‌ను అందుకోవడంతోనే ఫిలిఫ్ అకర్మన్, ఆయన బృంద సభ్యులు డ్యాన్స్ చేశారు. ఎర్ర కోట సమీపంలోని రోడ్డుకు దగ్గరలో ‘నాటు నాటు’ కు స్టెప్పులేశారు. అందరు కలసి అకస్మాత్తుగా చిందులేయడంతో ప్రజలు భారీగా అక్కడకు వచ్చారు. డ్యాన్స్ చేస్తున్న వారికి ప్రోత్సహం అందించారు. కొన్ని రోజుల క్రితమే ఈ పాటకు దక్షిణ కొరియా ఎంబసీ డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే.
‘నాటు నాటు’ పాటను చంద్రబోస్ రచించారు. కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ అలపించారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సాంగ్‌కు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరన్ మెస్మరైజింగ్ స్టెప్పులేసి అభిమానులను ఫిదా చేశారు.
^^^^^^^^^^^^^^^^^^^^^
ఇవి కూడా చదవండి:
Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..
Naatu Naatu: పాటపై సంచలన కామెంట్స్ చేసిన కీరవాణి తండ్రి శివశక్తి దత్తా
Oscars 2023: షాక్.. ఆస్కార్ వేడుకకు ఫ్రీ పాస్‌లు లేకపోవడంతో.. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ భారీ ఖర్చు..
RRR: రామ్ చరణ్, తారక్ అందువల్లే ఆస్కార్ స్టేజ్‌పై డ్యాన్స్ చేయలేదు!
Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!
Pawan Kalyan: నా రెమ్యునరేషన్ రోజుకు రెండు కోట్లు
Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!