NTR: ఎట్టకేలకు నందమూరి కుటుంబం నుండి ఎన్టీఆర్ కి ఆహ్వానం

ABN , First Publish Date - 2023-05-15T17:24:06+05:30 IST

ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ కి ఆహ్వానం అందింది. గత కొన్ని రోజులనుండి జరుగుతున్న చర్చకి తెర పడింది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ ని దూరం పెట్టారని అనుకుంటున్న సమయంలో, జూనియర్ ఎన్టీఆర్ కు నందమూరి కుటుంబం నుండి ఆహ్వానం వచ్చింది.

NTR: ఎట్టకేలకు నందమూరి కుటుంబం నుండి ఎన్టీఆర్ కి ఆహ్వానం
Junior NT Rama Rao

లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు ఎన్ టి రామారావు (NTRama Rao) శత జయంతి సంవత్సరం ఇది. అందుకని ఎన్టీఆర్ (NTR) శత జయంతి ఉత్సవాలు భారీగా జరుగుతున్నాయి. ఆమధ్య విజయవాడలో ఈ ఉత్సవానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ముఖ్య అతిధిగా విచ్చేసి మాట్లాడేరు. ఆ తరువాత దోహా (Doha) లో జరిగిన ఒక ఉత్సవంలో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ముఖ్య అతిధిగా పాల్గొన్నాడు. అయితే ఈ ఉత్సవాలు అన్నిటికీ జూనియర్ ఎన్టీఆర్ (JrNTR) కి ఆహ్వానం రాలేదని, అతను ఏ ఉత్సవంలోనూ పాల్గొనడం లేదని కొందరు నందమూరి అభిమానులు, అలాగే మామూలు పబ్లిక్ సాంఘీక మాధ్యమంలో కొంత చర్చ జరిపిన మాట వాస్తవం.

tarak1.jpg

అయితే వీటన్నిటినీ ఒక ఫుల్ స్టాప్ పెట్టె విధంగా నందమూరి తారకరామారావు గారి తనయుడు రామకృష్ణ (NandamuriRamakrishna), అలాగే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కమిటి చైర్మన్ టిడి జనార్దన్ (TD Janardhan) ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ని కలిసి మే 20 వ తేదీన హైదరాబాద్ లో జరిగే ఎన్టీఆర్ శత జయంతి #NTRCentenaryCcelebrations ఉత్సవానికి రావాలని ఆహ్వానం అందించారు. దీనితో ఎన్టీఆర్ ని దూరం పెట్టారు, పక్కన పెట్టారు అన్న విషయం ఇంకా చర్చకి ఏమాత్రం ఇక తావులేని విధంగా ఉండేట్టు ఈ ఆహ్వానం అందించారు.

ఇదిలా ఉండగా, కొన్ని రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (PuvvadaAjayKumar), ఖమ్మంలో (Khammam) ఏర్పాటు చేయనున్న 54 అడుగుల దివంగత (54 feet NTR idol) ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి, జూనియర్ ఎన్టీఆర్ ని కలిసి అహ్వలించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 100వ పుట్టినరోజు అయిన మే 28 న ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

Updated Date - 2023-05-15T17:24:06+05:30 IST