Salaar: ఎట్టకేలకు ప్రభాస్ సినిమా విడుదల గురించి ప్రకటన వచ్చింది

ABN , First Publish Date - 2023-09-13T11:40:54+05:30 IST

'సాలార్' సినిమా విడుదల గురించి ఎట్టకేలకు ఆ సినిమా నిర్మాతలు అయిన హోంబలే ఫిలిమ్స్ ఈరోజు ఒక అధికారిక ప్రకటన ఇచ్చింది. అందులో సినిమా ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చింది, కొత్త విడుదల తేదీ గురించి మాట్లాడేరు

Salaar: ఎట్టకేలకు ప్రభాస్ సినిమా విడుదల గురించి ప్రకటన వచ్చింది
Prabhas in Salaar

ప్రభాస్ (Prabhas), ప్రశాంత్ నీల్ (PrashanthNeel) కాంబినేషన్ లో రాబోతున్న 'సాలార్' #Salaar సినిమా గురించి ఎటువంటి ప్రకటన లేకపోవటం ప్రభాస్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది అన్న వార్తలు అందరికీ తెలిసిందే. #SalaarReleaseDate అయితే ఎట్టకేలకు ఆ సినిమా నిర్మాతలు అయిన హోంబలే ఫిలిమ్స్ (HombaleFilms) ఈ సినిమా గురించి ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు, అందులో ఈ సినిమా విడుదల గురించి కూడా మాట్లాడేరు.

"కొన్ని అనివార్య కారణాల వలన మేము సెప్టెంబర్ 28 న విడుదల చెయ్యాలనుకున్న సినిమా ఇంకా కొంచెం ఆలస్యం అవుతుంది. మీరందరూ అర్థం చేసుకుంటాని భావిస్తున్నాం, ఎందుకంటే ఈ జాప్యం అనేది మీకందరికి ఒక మంచి సినిమాటిక్ అనుభవం ఇవ్వడానికి, అలాగే మా బృందం ఈ సినిమాకి అత్యున్నత ప్రమాణాలను ఇవ్వడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. అలాగే కొత్త విడుదల తేదీని కూడా కొన్ని రోజుల్లో వెల్లడించనున్నాము, ఈ ప్రయాణంలో సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు" అని, హోంబలే ఫిలిమ్స్ ఒక అధికారిక ప్రకటన చేసింది.

Prabhas.jpg

అయితే ఇందులో ఈ సినిమా ప్రచార చిత్రాలు అంటే టీజర్, ట్రైలర్, లేదా ఈ సినిమా గురించి ఎటువంటి ప్రకటన లేకపోవటం మళ్ళీ అభిమానులను నిరాశ పరిచిందనే చెప్పాలి. ఎందుకంటే విడుదల తేదీ ఒక్కటే కాకుండా, అభిమానులకు ఈ సినిమా నుండి ఒక టీజర్, ప్రభాస్ కొత్త లుక్స్, లేదా వేరే వాళ్ళకి ఏమైనా విడుదల చేసి ఉంటే కాస్తా ఊరటగా ఉండేది అని ఒక టాక్ నడుస్తోంది. ఏమైనా కూడా 'సాలార్' #SalaarReleaseDate సినిమా విడుదల ప్రకటన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ (ShrutiHaasan) కథానాయిక కాగా, మలయాళం నటుడు ప్రిథ్వీరాజ్ సుకుమారన్ (PrithviSukumaran) కూడా వున్నారు. శ్రీయా రెడ్డి (SriyaReddy) కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనుంది అని తెలిసింది.

Updated Date - 2023-09-13T11:40:54+05:30 IST