Film Celebs: ’సెలబ్రిటీలు.. ఫాదర్స్ డే విషెస్
ABN , First Publish Date - 2023-06-18T17:41:45+05:30 IST
వేలు పట్టి నడిపించిన క్షణం నుంచి ఎదుగుదలలో ఎక్కే ప్రతి మెట్టుకు నాన్న అందించే ప్రోత్సాహం మాటల్లో చెప్పలేనిది. ఉన్నతి కోసం వేసే ప్రతి అడుగులోనూ నాన్న తపన కనిపిస్తుంది.. కంటికి రెప్పలా కాపాడతారు, . జీవితాన్ని నేర్పడమే కాదు.. మార్గనిర్దేశం కూడా చేస్తుంటారు. ఆదివారం నేషనల్ ఫాదర్స్ డేను పురస్కరించుకుని సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
వేలు పట్టి నడిపించిన క్షణం నుంచి ఎదుగుదలలో ఎక్కే ప్రతి మెట్టుకు నాన్న అందించే ప్రోత్సాహం మాటల్లో చెప్పలేనిది. ఉన్నతి కోసం వేసే ప్రతి అడుగులోనూ నాన్న తపన కనిపిస్తుంది.. కంటికి రెప్పలా కాపాడతారు, . జీవితాన్ని నేర్పడమే కాదు.. మార్గనిర్దేశం కూడా చేస్తుంటారు. ఆదివారం నేషనల్ ఫాదర్స్ డేను పురస్కరించుకుని సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. తండ్రితో దిగిన ఫొటోలు షేర్ చేశారు. (World Fathers DAY)
‘‘ఈ ప్రపంచంలో (Allu Arjun) ఉన్న నాన్నలందరికీ, ముఖ్యంగా ఈ ప్రపంచంలోనే బెస్ట్ ఫాదర్ (అల్లు అరవింద్‌ను ఉద్దేశించి) హ్యాపీ ఫాదర్స్ డే’’ అని అల్లు అర్జున్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. (International fathers day)
‘‘కాజల్, తన సోదరి నిషా అగర్వాల్ తన తండ్రితో దిగిన ఫొటోను షేర్ చేసి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ‘నువ్వు లేకుండా మేం ఏంటి అంటేనే భయమేస్తుంది’’ అని రాసుకొచ్చారు. అలాగే మరో పోస్ట్ కూడా చేశారు. ‘నీల్‌కు నాకూ ప్రత్యేకమైన వ్యక్తి గౌతమ్‌కు హ్యాపీ ఫాదర్స్ డే. నీల్ మీకు అందించే అత్యుత్తమ బహమతి ఏమిటంటే.. ‘పాపా’ అంటూ లూప్‌లో పిలవడమే’ అని కాజల్ పేర్కొన్నారు. (kajal)
‘‘నేను ఎప్పటికీ డాడీ గర్ల్‌నే. విషయం ఏదైనా సరే ముందు ఆయనతోనే పంచుకునేదాన్ని. ఆయనే నాకు గైడ్, పిల్లర్, హీరో. నేను నా తండ్రితో ఎలాంటి అనుబంధాన్ని కలిగి ఉన్నానో.. అదే విధమైన ప్రేమానుబంధాన్ని ఆర్య, యాత్రవ్ తమ తండ్రి(యశ్)తో కలిగి ఉండటం చూసి నాకెంతో ఆనందంగా అనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే’’ అని పోస్ట్ చేశారు. యశ్ భార్య రాధిక పండిట్. (radhika pandit)