Celebs Wishes To Pawan: జనహితమే లక్ష్యంగా.. వారి ప్రేమే ఇందనంగా..!
ABN , First Publish Date - 2023-09-02T12:57:59+05:30 IST
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు (Pawan kalyan) సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఆయన సోదరుడు చిరంజీవి (Chiranjeevi Wishes) ప్రత్యేకంగా ట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ‘డియర్ కల్యాణ్ బాబు.. జనహితమే లక్ష్యంగా.. వారి ప్రేమే ఇందనంగా నిరంతరం సాగే నీ ప్రయాణంలో ...
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు (Pawan kalyan) సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఆయన సోదరుడు చిరంజీవి (Chiranjeevi Wishes) ప్రత్యేకంగా ట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ‘డియర్ కల్యాణ్ బాబు.. జనహితమే లక్ష్యంగా.. వారి ప్రేమే ఇందనంగా నిరంతరం సాగే నీ ప్రయాణంలో నీ ఆశయాలు సిద్ధించాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ ఉన్నత భావాలు, గొప్ప సంకల్పాలు ఉన్న ఈ జనహృదయ సేనాని నా తమ్ముడైనందుకు గర్విస్తూ నీకు జన్మదిన శుభాకాంక్షలు’’ అని చిరంజీవి ట్విట్టర్ వేదికగా విష్ చేశారు. ఆయనతో పాటు అల్లు అర్జున్, తారక్ ఫ్యాన్ పేజీల నుంచి కూడా పవన్‌కు శుభాకాంక్షలు వెల్తువెత్తాయి. అలాగే రవితేజ, సంపత్ నంది, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, సాగర్ కె చంద్రలతోపాటు నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, హారికా అండ్ హాసిని క్రియేషన్స్, శ్రేష్ఠ్ మూవీస్, డి.వి.వి ఎంటర్టైన్మెంట్స్,
"అతను తమ్ముడు!
అతనంటే ఫాన్స్ కి ఖుషి!
జబ్బలు చరిచే వాళ్లకు అతను గబ్బర్ సింగ్ !
అత్తారింటికి దారేది అని వెతికే యువతీయువకులకు దారి చూపించే బంగారం.
అతడే పవన్ కళ్యాణ్ !
జన్మదిన శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ అని పరుచూరి గోపాలకృష్ణ ట్వీట్ చేశారు.
"ఒక నటుడి నటన మాత్రమే బాగుంటే ఆయన సినిమాల వరకు చూసి ఆదరిస్తారు. అంతకు మించి ఏదో గొప్పదనం ఉంటే వాళ్ళ హృదయంలో గుడి కట్టి పూజిస్తారు. అలాంటి పూజలు ఎన్నో అందుకుంటూ మానవ సేవే మాధవ సేవ అని నమ్మే జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
- గోపి మోహన్
పవన్‌కల్యాణ్‌ను విమర్శించే రామ్‌గోపాల్ వర్మ సైతం పవన్‌కు విషెస్ చెప్పి... ‘ఓజి’ గ్లింప్స్ అద్భుతంగా ఉందని, పవన్‌కల్యాణ్ ట్రైలర్స్‌లో ది బెస్ట్ ఇదేనని అభినందించారు.
"మిమ్మల్ని చూసిన ప్రతి సారి అన్పిస్తుంది- "మనపై అభిమానం తనంత తానుగా రావాలి . మనంత మనంగా సంపాదించుకోవాలి" అని. ఎందుకంటే, అలా పుట్టిన అభిమానం, అభిమానులు కడదాకా మనతోనే ఉంటారు. మీ ఆశయం నెరవేరాలి సర్. మంచి సమాజం కోసం మీరు చేస్తున్న యుద్ధం గెలవాలి. జనసైన్యం విజయదుందుభి మ్రోగించాలి"
- అబ్బూరి రవి