Vijay Devarakonda : ఫ్యామిలీ స్టార్‌ డైలాగ్‌ క్రేజ్‌ మామూలుగా లేదుగా!

ABN , First Publish Date - 2023-10-27T16:54:03+05:30 IST

సోషల్‌ మీడియాలో ఓ విషయం ట్రెండ్‌ అయింది అంటే దాని క్రేజ్‌ మామూలుగా ఉండదు. ప్రస్తుతం ఎక్స్‌ (ట్విట్టర్‌) విపరీతంగా ట్రెండ్‌ అవుతున్న డైలాగ్‌ ‘ఐరనే వంచాలా ఏంటి’. 'ఫ్యామిలీ స్టార్‌' సినిమాలోని విజయ్‌ దేవరకొండ చెప్పిన డైలాగ్‌ ఇది.

Vijay Devarakonda : ఫ్యామిలీ స్టార్‌ డైలాగ్‌ క్రేజ్‌ మామూలుగా లేదుగా!

సోషల్‌ మీడియాలో ఓ విషయం ట్రెండ్‌ అయింది అంటే దాని క్రేజ్‌ మామూలుగా ఉండదు. ప్రస్తుతం ఎక్స్‌ (ట్విట్టర్‌) విపరీతంగా ట్రెండ్‌ అవుతున్న డైలాగ్‌ ‘ఐరనే వంచాలా ఏంటి’ . 'ఫ్యామిలీ స్టార్‌' సినిమాలోని విజయ్‌ దేవరకొండ చెప్పిన డైలాగ్‌ ఇది. ఈ సినిమా టైటిల్‌ను ప్రకటిస్తూ విడుదల చేసిన గ్లింప్స్‌లో ‘ఉల్లిపాయలు కొంటే మనిషికాదా? పిల్లల్ని రెడీ చేేస్త మగాడు కాదా? ఐరనే వంచాలా ఏంటి?’ అని డైలాగ్‌ చెబుతూ ఐరన్‌ రాడ్‌ను వంచుతాడు. దీనిని ప్రభాస్‌ నటించిన మిర్చిలోని ఓ సన్నివేశానికి ‘ఐరనే వంచాలా ఏంటి’ డైలాగ్‌ మిక్స్‌ చేసి విజయ్‌ (Vijay devarakonda) దేవరకొండ ఇనస్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఇంటర్‌నెట్‌ అసలు ఏం నడుస్తోంది’ అని ఫన్నీగా కామెంట్‌ పెట్టాడు. #AiraneVanchalaenti

ఇలాంటి క్రేజీ కంటెంట్‌ దొరికితే మీమర్స్‌ ఊరుకుంటారా? తమ టాలెంట్‌, క్రియేటివిటీ మొత్తాన్ని బయటకు తీసి మీమ్స్‌ క్రియేట్‌ చేస్తుంటారు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఈ వీడిమో వైరల్‌ కావడంతో మీమర్స్‌ తమదైన శైలిలో మీమ్స్‌ చేస్తున్నారు. ప్రభాస్‌ ‘బాహుబలి’, అల్లు అర్జున్‌ ‘సరైనోడు’, కలర్ ఫోటో ఇలా రకరకాల మీమ్స్‌ చేసి సోషల్‌ మీడియాలో వదులుతున్నారు. దీంతో ఒక్కసారిగా ఈ చిత్రానికి విపరీతమైన హైప్‌ క్రియేట్‌ అయింది. రెండ్రోజులుగా సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసిన ఇదే టాపిక్‌. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ మీమ్స్‌ చూసి 'అసలు నవ్వు ఆగడం లేదు’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. గీత గోవిందం తర్వాత విజయ్‌, పరశురామ్‌ కాంబినేషనలో వస్తున్న చిత్రమిది. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది.

Updated Date - 2023-10-27T16:54:34+05:30 IST