Pushpa 2: ప్రతీకారం తీర్చుకోడానికి వస్తున్నాడు!
ABN , First Publish Date - 2023-08-08T15:38:01+05:30 IST
‘పార్టీ లేదా పుష్ప’ (Pushpa 2) అంటూ ‘పుష్ప’ చిత్రంలో ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil) చెప్పిన డైలాగ్ ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే! ‘పుష్ప’ చిత్రంలో ఆయన పోషించిన భన్వర్‌సింగ్ షెకావత్ పాత్ర తెలుగులో కూడా ఆయనకు మంచి గురింపు తీసుకొచ్చింది.

‘పార్టీ లేదా పుష్ప’ (Pushpa 2) అంటూ ‘పుష్ప’ చిత్రంలో ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil) చెప్పిన డైలాగ్ ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే! ‘పుష్ప’ చిత్రంలో ఆయన పోషించిన భన్వర్‌సింగ్ షెకావత్ పాత్ర తెలుగులో కూడా ఆయనకు మంచి గురింపు తీసుకొచ్చింది. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘పుష్ప 2 - ద రూల్’ (Pushpa2) నుంచి కొత్త పోస్టర్‌తో సందడి చేశారు. ఫహాద్ ఫాజిల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ చిత్రం బృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని స్టైలిష్‌గా సిగరెట్ తాగుతూ కనిపిస్తున్న ఫహద్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. ‘ఈసారి ఆయన ప్రతీకారం తీర్చుకోడానికి వస్తున్నాడు’ అంటూ ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. ‘పుష్ప ది రైజ్’ లో అల్లు అర్జున్, ఫహద్ మధ్య పోటాపోటీగా సాగే సీన్స్.. ‘పుష్ప-2 ది రూల్’పై అంచనాలు పెంచాయి. ప్రస్తుతం విడుదల చేసిన పోస్టర్ నెట్టింట సందడి చేస్తుంది. షెకావత్ సర్ పార్టీ లేదా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘పుష్ప’ చిత్రం ప్యాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించడంతో ‘పుష్న-2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో దర్శకుడు అంతకుమించి అనేలా రెండో పార్టును తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.