Eesha rebba: అక్కడ గౌరవంగా చెప్పుకుంటున్నారు.. ఇక్కడ మాత్రం...
ABN , First Publish Date - 2023-07-09T13:31:06+05:30 IST
‘అంతకు ముందు ఆ తర్వాత’ చిత్రంతో కథానాయికగా పరిచయమయ్యారు తెలుగమ్మాయి ఈషా రెబ్బ. తర్వాత వరుసగా ‘అమీతుమీ’, ‘అ’, ‘అరవింద సమేత’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాలతో మంచి గుర్తింపు పొందారు. తాజాగా ఇచ్చిన ఓ ఛానల్ ఇంటర్వ్యూలో టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలకు దక్కుతున్న అవకాశాల గురించి మాట్లాడారు.
‘అంతకు ముందు ఆ తర్వాత’ (Anthakumundu Aa tarwatha) చిత్రంతో కథానాయికగా పరిచయమయ్యారు తెలుగమ్మాయి ఈషా రెబ్బ(Eesha rebba). తర్వాత వరుసగా ‘అమీతుమీ’, ‘అ’, ‘అరవింద సమేత’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాలతో మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం తెలుగులో సుధీర్‌బాబు సరసన ‘మామ మాశ్చీంద్ర’లో నటిస్తున్న ఈషా.. జేడీ చక్రవర్తి సరసన ‘దయా’ అనే మూవీ చేస్తోంది. తమిళ, మలయాళ చిత్రాల్లోనూ అవకాశాలు అందుకొంది. ఓటీటీల్లోనూ వరుస అవకాశాలు అందుకుంటోంది. తాజాగా ఇచ్చిన ఓ ఛానల్ ఇంటర్వ్యూలో టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలకు దక్కుతున్న అవకాశాల గురించి మాట్లాడారు.
‘‘ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళ, మలయాళ చిత్రాలు చేస్తున్నా. ఇతర పరిశ్రమలో ప్రస్తుతం మిగతా పరిశ్రమల వాళ్లు కూడా తెలుగు సినిమా స్టామినా గురించే మాట్లాడుకుంటున్నారు. అక్కడ షూటింగ్ కోసం వెళ్లినప్పుడు అక్కడి వారంతా టాలీవుడ్ గురించే మాట్లాడుకోవడం చూసి గర్వంగా అనిపించేది. కానీ ఇక్కడ తెలుగు భాష వచ్చినవారికంటే.. తెలుగు తెలియని వారరికే అవకాశాలు ఎక్కువ. ఇతర రాష్ర్టాల వాళ్లని హీరోయిన్స్‌గా పెటుకోవాలని ప్రేక్షకులు మేకర్స్‌ని అడగరు. అలాంటప్పుడు వారికే ఎక్కువ అవకాశాలు ఎందుకివ్వాలి? అయితే నేను హీరోయిన్లను ఉద్దేశించే కాదు అన్ని పాత్రల గురించి అడుగుతున్నా. తెలుగు వారిలో ఎంతోమంది ప్రతిభ ఉన్న వారు ఉన్నారు. కానీ వారికి ఎలాంటి అవకాశాలు దక్కడం లేదు. ఒకవేళ ఏదన్నా దక్కినా హీరోయిన్‌గా మాత్రం ఉందడు’’ అని అన్నారు ఈషా రెబ్బ. (Comments on tollywood)
తనకు యాక్షన్ సినిమా చేయాలనే కోరిక ఉందని ఈషా చెప్పారు. ‘ఓటీటీ సినిమాలకు కూడా థియేటర్లో విడుదలయ్యే సినిమాల్లాగే గుర్తింపు వస్తుంది. కెరీర్ మొత్తంలో ఒక్క యాక్షన్ సినిమా చేయాలని కోరిక ఉంది. అలాగే విభిన్న పాత్రల్లో నటించడం ఇష్టం. ప్రస్తుతం నేను చేస్తున్న ఓ తెలుగు సినిమాలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా నటిస్తున్నాను. అలాగే మరో సినిమాలో పోలీస్‌గా కనిపించనున్నాను. ఇలాంటి పాత్రల కోసం కరోనా సమయంలో ఆర్చరీ వంటి విద్యలు నేర్చుకున్నా. నాకున్న నైపుణ్యాలను సద్వినియోగం చేసుకోవడానికి ఎదురుచూస్తున్నా’’ అని అన్నారు ఈషా రెబ్బ అన్నారు.