Ravi Teja: లండన్‌లో ‘ఈగల్‌’ పోరు!

ABN , First Publish Date - 2023-08-21T16:22:47+05:30 IST

‘ధమాకా’ హిట్‌ తర్వాత రవితేజ హీరోగా ‘ఈగల్‌’ చిత్రాన్ని నిర్మిస్తోంది పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ గ్లింప్స్‌ చక్కని స్పందన వచ్చి అంచనాలు పెరిగిన సంగతి తెలిసిందే! ఈ చిత్రం తదుపరి షెడ్యూల్‌ లండన్‌లో ప్రారంభం కానుంది.

Ravi Teja: లండన్‌లో ‘ఈగల్‌’ పోరు!

‘ధమాకా’ హిట్‌ తర్వాత రవితేజ హీరోగా ‘ఈగల్‌’ చిత్రాన్ని నిర్మిస్తోంది పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ గ్లింప్స్‌ చక్కని స్పందన వచ్చి అంచనాలు పెరిగిన సంగతి తెలిసిందే! ఈ చిత్రం తదుపరి షెడ్యూల్‌ లండన్‌లో ప్రారంభం కానుంది. అక్కడ రవితేజతోపాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. రవితేజ ఇప్పటికే లండన్‌ పయనమయ్యారు. దీనికి సంబంధించిన ఎయిర్‌పోర్ట్‌ వీడియోలో నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఇందులో రవితేజ మల్టీ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపిస్తారు. రవితేజ ఎనర్జీకి తగ్గట్లు కార్తిక్‌ ఆయన పాత్రను డిజైన్‌ చేశారని చిత్ర బృందం చెబుతోంది. ఇందులో మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికగా నటిస్తుండగా, కావ్య థాపర్‌ మరో కథానాయికగా కనిపించనుంది మధుబాల, నవదీప్‌ కీలక పాత్రల్లో కనిపిస్తారు.

మణిబాబు కరణంతో కలిసి కార్తిక్‌ స్వయంగా స్ర్కీన్‌ ప్లే రాశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - 2023-08-21T16:37:13+05:30 IST