Dulquer Salmaan: ఈ ‘సీతారామం’ హీరోకు సడన్‌గా ఏమైంది..? ఎందుకిలా చేశాడు..?
ABN , First Publish Date - 2023-07-03T13:31:00+05:30 IST
ఓకే బంగారం’, ‘మహానటి’, ‘సీతారామం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకునన దుల్కర్ సల్మాన్ భావోద్వేగానికి లోనయ్యారు. తాజాగా ఎమోషనల్‌గా మాట్లాడుతున్న వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి బాధతో కూడిన ఎమోజీలను షేర్ చేశాడు. మళ్లీ నిమిషాల్లోనే ఆ వీడియో డిలీట్ చేశారు.
'ఓకే బంగారం’, ‘మహానటి’, ‘సీతారామం’(Sita Ramam) చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకునన దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) భావోద్వేగానికి లోనయ్యారు. తాజాగా ఎమోషనల్‌గా మాట్లాడుతున్న వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి బాధతో కూడిన ఎమోజీలను షేర్ చేశాడు. మళ్లీ నిమిషాల్లోనే ఆ వీడియో డిలీట్ చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ ‘‘మొదటిసారి ఎప్పుడూ ఎదురుకానీ ఓ అనుభవం ఎదురైంది. అయితే ఎప్పటి లాంటి విషయం కాదది. దాని ప్రభావం నాపై ఎంతగా ఉందంటే ఆ విషయాన్ని మైండ్‌లో నుంచి తీయలేకపోతున్నాను. నిద్ర లేకుండా గడుపుతున్నా. ఎంతో మాట్లాడాలని ఉంది. కానీ మాట్లాడలేకపోతున్నా’’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు. (Dulquer Salmaan Emotional post)
అయితే ఆ వీడియో పోస్ట్ చేసిన కాసేపటికే ఇన్‌స్టా నుంచి తొలగించారు దుల్కర్. అయితే ఇప్పుడు ఈ వీడియో గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వీడియో డిలీట్ చేసే లోపే చాలామంది డౌన్లోడ్ చేశారు, భావోద్వేగంగా ఉన్న దుల్కర్ ఫొటోలను స్ర్కీన్షాట్గా తీశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలో నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో ఓ నెటిజన్ ‘అసలు దుల్కర్‌కు ఏమైంది. ఎందుకు అలాంటి వీడియో పోస్ట్ చేశాడు. అతనికి వచ్చిన బాధేంటి’ అన్ని ప్రశ్నలు సంధించాడు.. మరో నెటిజన్ ‘దుల్కర్ అంతా ఓకేనా.. ఏమన్నా సమస్యా? అని పోస్ట్ చేశాడు. ‘దుల్కర్ ఆ వీడియో పోస్ట్ చేసిన నిమిషాల్లోనే కామెంట్ సెక్షన్లో వివాదస్పద కామెంట్లు రాగా అంతలోనే ఆ వీడియో డిలీట్ చేశాడు. కొందరు నెటిజన్లు అయితే నిజంగా ఏదన్నా సమస్యా లేక.. ఏదన్నా ప్రకటనలో భాగమా? అని కూడా కామెంట్ చేస్తున్నారు.
అసలు దుల్కర్ కన్నీటి పర్యాంతమవుతున్న ఆ వీడియో ఎందుకు పోస్ట్ చేశాడు? వెంటనే ఎందుకు డిలీట్ చేశాడు అన్నది తెలియాల్సి ఉంది. ఇటీవల ఆయన నటించిన ‘కింగ్ ఆఫ్ కోత’ చిత్రం టీజర్‌ను మహేశ్‌బాబు విడుదల చేశారు.