Pushpa 2- DSP : మైండ్‌ బ్లోయింగ్‌ సీక్వెన్స్‌..

ABN , First Publish Date - 2023-09-09T16:33:26+05:30 IST

అల్లు అర్జున్‌ హీరోగా రూపొందుతున్న ‘పుష్ప- ది రూల్‌’ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ‘పుష్ప’ సక్సెస్‌తో రెండో పార్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి సుకుమార్‌ ఎలాంటి ట్రీట్‌ ఇవ్వనున్నారోనని ఐకాన్‌స్టార్‌ అభిమానులు ఎదుచురూస్తున్నారు.

Pushpa 2- DSP : మైండ్‌ బ్లోయింగ్‌ సీక్వెన్స్‌..

అల్లు అర్జున్‌ హీరోగా రూపొందుతున్న ‘పుష్ప- ది రూల్‌’ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ‘పుష్ప’ సక్సెస్‌తో రెండో పార్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి సుకుమార్‌ ఎలాంటి ట్రీట్‌ ఇవ్వనున్నారోనని ఐకాన్‌స్టార్‌ అభిమానులు ఎదుచురూస్తున్నారు. అంచనాలు మరింత పెరిగే అప్‌డేట్‌ ఇచ్చారు చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌. ఈ చిత్రం ఊహకు అందని రేంజ్‌లో ఉంటుందని చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన చెప్పారు. సినిమా కోసం అభిమానుల్లాగే మేం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చెప్పారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకు సంబంధించిన విషయాలను ఇప్పుడే ఎక్కువగా చెప్పలేను. ఒక విషయం మాత్రం చెప్పగలను. ఎవరూ ఊహించని విధంగా సుకుమార్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇదొక మైండ్‌ బ్లోయింగ్‌ స్ర్కిప్ట్‌. ఒక సీక్వెన్స్‌కు సంబంధించిన విజువల్స్‌ నేను చూశా. ఆ సీక్వెన్స్‌ గురించి ఎక్కువగా చెప్పను. కాకపోతే అది మాత్రం మైండ్‌ బ్లోయింగ్‌ సీక్వెన్స్‌’’ అని దేవిశ్రీ ప్రసాద్‌ చెప్పారు. ప్రస్తుతం దేవి మాటలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ కథాంశంతో సుకుమార్‌ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రష్మిక కథానాయిక.

Updated Date - 2023-09-09T16:34:08+05:30 IST