Ram Charan: ఉపాసనకి రామ్ చరణ్ ఇచ్చిన మొదటి బంగారం గిఫ్ట్ ఏంటో తెలుసా ?

ABN , First Publish Date - 2023-04-13T11:38:20+05:30 IST

అందరి దృష్టి రాంచరణ్, ఉపాసనల మీదే వుంది, ఎందుకంటే వాళ్లిద్దరూ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. అయితే ఈ సమయంలో ఉపాసన ఏమి తింటుంది, ఎలా తింటుంది, బరువు పెరగకుండా ఎటువంటి నియమాలు పాటిస్తోంది తెలుసుకోవాలనుందో...

Ram Charan: ఉపాసనకి రామ్ చరణ్ ఇచ్చిన మొదటి బంగారం గిఫ్ట్ ఏంటో తెలుసా ?

రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన కామినేని (Upasana Kamineni) ఇప్పుడు టాలీవుడ్ క్యూట్ కపుల్ (Cute couple) అని అంటున్నారు. ఈమధ్య కాలంలో ఎక్కడ చూసినా వీళ్లిద్దరే కనపడుతున్నారు. ట్రావెల్ చేస్తూనో, లేదా ఏదైనా సెమినార్, లేక ఏదైనా ఫంక్షన్ ఒకటేంటి ప్రపంచం మొత్తం చుట్టి వచ్చేస్తున్నారు. నిన్న ఉపాసన ఒక బంగారం ప్రదర్శనకి వచ్చారు. అక్కడ ఆమె తన పెర్సనల్ విషయాలను కూడా పంచుకున్నారు.

ramcharan-upasana-oscars95a.jpg

ఉపాసన ఇప్పుడు తల్లి కాబోతోంది కదా, మరి ఎలాంటి ఆహారం తీసుకుంటోంది అని అడిగిన ప్రశ్నకు, ఆమె డాక్టర్స్ చెప్పిన డైట్ ఫాలో అవుతున్నాను అని చెప్పింది. (Upasana following strict diet) చాలామంది పది నుండి పన్నెండు కిలోలు పెరుగుతారు అని ఈ సమయంలో, కానీ తాను ఆలా కాకుండా చాలా కఠినమయిన ఆహార నియమాలు పాటిస్తున్నామని చెప్పింది. ఆలా అని ఇద్దరికి (ఆమె కడుపులో పెరుగుతున్న బేబీ) కలిపి ఆహరం తీసుకోవటం లేదని, తన ఒక్కరికి సరిపడా ఆహారం తింటున్నాని చెప్పింది. ఇద్దరి కోసం తినటం మంచి పద్ధతి కాదని, అలా అని ఏమి తినకుండా లేనని, తనకి మంచి శక్తి, చలాకీగా ఉండటం కోసం కావలసిన ఆహారం మాత్రం తీసుకుంటున్నాను అని చెప్పింది.

ramcharanupasanakamineni.jpg

ఆస్కార్ అవార్డు (Oscar Award) 'ఆర్.ఆర్.ఆర్' (RRR) సినిమాకి రావటం సంతోషం అని చెపుతూనే, ప్రపంచం అంతా తాను రామ్ చరణ్ చుట్టి రావటం ఇంకా చాలా సంతోషం అనిపించిందని చెప్పింది ఉపాసన. బేబీ తో కూడా వెళ్ళటం ఇంకా ఆనందంగా వుంది అని చెప్పింది. చరణ్ ఆమెకి ఫస్ట్ బంగారం కనుక ఏమి ఇచ్చాడు అని అడిగితే, "చెవులకి పెట్టుకునే రింగులు (Ear rings) ఇచ్చాడు. అది కూడా వాలెంటైన్స్ డే రోజు (Valentines Day)" అని చెప్పింది ఉపాసన. మరి ఈమె చరణ్ తిరిగి ఏమి గిఫ్ట్ ఇచ్చింది అని అడిగితే, "చాలా ప్రేమని ఇచ్చాను" అని చెప్పింది ఉపాసన.

Updated Date - 2023-04-13T11:38:22+05:30 IST