Ram Charan Upasana: వీళ్ళు ఎక్కడికెళ్లినా వాళ్ళతో పాటు ఏమి తీసుకెళతారో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

ABN , First Publish Date - 2023-03-14T12:06:07+05:30 IST

నిన్న 'ఆర్.ఆర్.ఆర్' లోని 'నాటు నాటు' (Naatu Naatu) పాటకి ఆస్కార్ వచ్చింది. దీని వెనక చాలామంది కృషి వుంది, అందులో రామ్ చరణ్ కూడా వున్నాడు. అయితే మరి రామ్ చరణ్ కి నమ్మకమయిన ఇంకొకటి అతను ఎక్కడికి వెళ్లినా తనతో పాటు తీసుకు వెళుతూ ఉంటాడు. అది ఎవరంటే....

Ram Charan Upasana: వీళ్ళు ఎక్కడికెళ్లినా వాళ్ళతో పాటు ఏమి తీసుకెళతారో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

రామ్ చరణ్ (Ram Charan), అతని భార్య ఉపాసన కొణిదెల (Upasana Konidela) ఇద్దరూ నిన్న అమెరికాలో ఆస్కార్ అవార్డు (Oscars95) ఫంక్షన్ కి వెళ్లారు. ఆ ఫంక్షన్ కి కొన్ని రోజుల ముందుగానే అమెరికా వెళ్లి అక్కడ మీడియా వాళ్ళతో, టీవీ చానెల్స్, రేడియో లో మాట్లాడి 'ఆర్.ఆర్.ఆర్' (RRR) సినిమా గురించి, అలాగే భారతదేశం గురించి ఎంతో గొప్పగా చెప్పారు.

ramcharan-upasana3.jpg

ఆ తరువాత అతి ముఖ్యమయిన రెడ్ కార్పెట్ (Oscar Red Carpet) అంటే ఆస్కార్ అవార్డ్స్ ఇచ్చేముందు సెలబ్రిటీస్ అందరూ ఆ రెడ్ కార్పెట్ మీదుగా నడుచుకుంటూ వచ్చి తమకి కేటాయించిన సీట్స్ లో కూర్చుంటారు. ఆ రెడ్ కార్పెట్ మీద నడుస్తున్నప్పుడు అందరి కళ్ళూ వాళ్ళు ఎలాంటి అవుట్ ఫిట్ (Outfit) వేసుకున్నారు, ఏమి ఆభరణాలు ధరించారు, ఎలా తయారయ్యారు లాంటి విషయాల మీదే ఉంటుంది.

ramcharan-upasana4.jpg

రామ్ చరణ్, ఉపాసనలు భారతీయ సంస్కృతి ప్రతిబింబించే విధంగా వున్నా అవుట్ ఫిట్స్ వేసుకున్నారు. రామ్ చరణ్ భారతీయ డిజైనర్ శాంతను & నిఖిల్ (Designer Shantanu & Nikhil) అంటే చాల ఇష్టమని, వాళ్ళు తాయారు చేసిన అవుట్ ఫిట్ వేసుకున్నాడు. అలాగే ఆ బ్లేజర్ మీద భారతీయ సింబల్స్ వుండే విధంగా అమర్చారు. అలాగే షర్ట్ బటన్స్ కూడా భారతీయ సింబల్స్ వుండే విధంగా చేశారు. మొత్తం భారతీయ సంస్కృతికి అద్దం పట్టె విధంగా తమ అవుట్ ఫిట్ ని తయారు చేయించుకున్నారు.

ramcharanupasana3.jpg

ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రామ్ చరణ్, ఉపాసనలు ఎక్కడికెళ్లినా తమతో పాటు ఏమి తీసుకుళతారో తెలుసా. సీత లక్ష్మణ సహిత శ్రీరాముడిని (Lord Sriram) తనతో పాటు ఎప్పుడూ తీసుకు వెళుతూ వుంటాను అని చెప్పాడు. అలాగే స్వామి హనుమను (Hanuman) కూడా తీసుకు వెళతాడట ఎక్కడికి వెళ్లినా. హోటల్ లో దిగగానే అక్కడ ఒక చిన్న సైజు టెంపుల్ తయారు చేసేస్తారట ఇద్దరూ. అలా చెయ్యడం ఇండియా తో కనెక్టివిటీ ఉంటుందని, అలాగే కొన్ని ఆచారాలను అనుసరించాలని కూడాను. తనకు హెల్ప్ చేసిన వాళ్ళు అందరికీ కృతజ్ఞత చెప్పాలి కదా అందుకనే ఉదయాన్నే దేవుడికి దండం పెట్టుకొని బయలుదేరడం అలవాటు అని చెపుతున్నాడు రామ్ చరణ్.

ramcharan-upasana.jpg

ఎక్కడికి వెళ్లినా, భారత దేశం సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోకుండా రామ్ చరణ్ అతని భార్య ఉపాసన ఇద్దరూ ఫాలో అవుతూ వుంటారు. ఇంకో ఆసక్తికర అంశం ఏంటి అంటే, రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) కూడా గొప్ప హనుమంతుని భక్తుడు.

ఇది కూడా చదవండి:

ది ఆస్కార్ అవార్డు గోజ్ టు 'నాటు నాటు'

Updated Date - 2023-03-14T12:06:08+05:30 IST