NTR: ఒత్తిడి వున్నప్పుడు ఎన్టీఆర్ ఏమి చేస్తాడో తెలిస్తే షాక్ అవుతారు

ABN , First Publish Date - 2023-05-20T12:29:09+05:30 IST

సినిమా పరిశ్రమలో నటులకి ఒత్తిడి ఉంటుంది ఎందుకంటే అంత పెద్ద బడ్జెట్ తో సినిమాలు విడుదల అవుతాయి, అవి తమ అభిమానులను అలరిస్తాయో లేదో అని. మరి అలంటి ఒత్తిడి వున్నప్పుడు ఎన్టీఆర్ ఏమి చేస్తాడో తెలుసా..

NTR: ఒత్తిడి వున్నప్పుడు ఎన్టీఆర్ ఏమి చేస్తాడో తెలిస్తే షాక్ అవుతారు
NT Rama Rao

ప్రతి నటుడికి సినిమా ముందు, తరువాత చాలా ఒత్తిడి ఉంటుంది. అలాగే ఒక సినిమా ఫెయిల్ అయినప్పుడు కూడా ఇంకా ఆ ఒత్తిడి పెరుగుతుంది. అదీ కాకుండా వేల, లక్షల కొద్దీ అభిమానులు వున్న నటులకి కూడా ఈ ఒత్తిడి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రతి సినిమా బాగా చెయ్యాలి, అది విజయం సాధించాలి అనే కదా చేస్తారు. అభిమానులకు నచ్చితే, ఆ ఉత్సాహంతో మరికొన్ని సినిమాలు చేస్తారు.

ntramarao4.jpg

అయితే ఈరోజు ఎన్టీఆర్ (NTR) పుట్టినరోజు. అతను ఇంతకు ముందు చెప్పిన కొన్ని సంగతులను షేర్ చేసుకుందాం. చాలామంది నటులకు వున్నట్టే అతనికి కూడా ఒత్తిడి ఉంటుంది అని చెప్పాడు. అయితే అలాంటప్పుడు అతను ఏమి చేస్తాడో తెలుసా? "నేను మా ఆవిడ ప్రణతికి (Pranathi) వంట చేసి పెడతాను. ఎందుకంటే చాలామందికి తెలియదేమో నేను బ్రహ్మాండంగా వండుతాను, అన్ని వంటలూ బాగా చేస్తాను. ఒత్తిడి పెరిగినప్పుడల్లా నేను కిచెన్ లోకి వంట చేస్తూ వుంటాను. అదే నా ఒత్తిడిని తగ్గిస్తుంది," అని చెప్పాడు ఎన్టీఆర్. #ManOfMassesNTR

ఇంకో ఒత్తిడిని తగ్గించే మార్గం ఏంటో తెలుసా. "ట్రావెల్. నేను ఒత్తిడి వున్నప్పుడు నా కుటుంబాన్ని తీసుకొని ట్రావెల్ కి వెళతాను. నాకు దుబాయ్ (Dubai) అంటే చాలా ఇష్టం. నేను ఎక్కువ షాపింగ్ కూడా చేస్తాను. షాపింగ్ అంటే ఇష్టం. ఇంతకు ముందు నా కోసం చేసుకునేవాడిని, కానీ ఇప్పుడు పిల్లల షాపులు కనపడితే చాలు ఆగిపోయి, నా పిల్లల కోసం షాపింగ్ చేస్తాను. ఇలా కుటుంబంతో ట్రావెల్ చెయ్యడం వలన కూడా ఒత్తిడి తగ్గించుకుంటాను," అని చెప్పాడు.

ntramarao3.jpg

ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అతని సినిమా టైటిల్ 'దేవర' #Devara అని ప్రకటించారు, అలాగే అందులోనుండి ఒక లుక్ ను కూడా విడుదల చేశారు. కొరటాల శివ (KoratalaSiva) దీనికి దర్శకుడు. ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ (NandamuriKalyanRam) ఈ సినిమాకి నిర్మాత. #War2 ఈ సినిమా అయ్యాక, ఎన్టీఆర్ బాలీవుడ్ 'వార్ 2' #War2 అనే సినిమాతో డెబ్యూ చెయ్యబోతున్నాడు. అందులో హృతిక్ రోషన్ (HrithikRoshan) కూడా ఒక లీడ్ యాక్టర్.

Updated Date - 2023-05-20T12:29:15+05:30 IST