Venkatesh Maha: ప్రేక్షకులకు హెచ్చరిక..!

ABN , First Publish Date - 2023-03-09T18:37:34+05:30 IST

కెరీర్ ఆరంభం నుంచి కొత్త పంథాలో వెళుతున్న దర్శకుడు వెంకటేశ్ మహా (Venkatesh Maha). ‘కేరాఫ్‌ కంచరపాలెం’ (Care of Kancharapalem), ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ (Uma Maheswara Ugra Roopasya) వంటి చిత్రాలతో భారీ హిట్స్ కొట్టారు.

Venkatesh Maha: ప్రేక్షకులకు హెచ్చరిక..!

కెరీర్ ఆరంభం నుంచి కొత్త పంథాలో వెళుతున్న దర్శకుడు వెంకటేశ్ మహా (Venkatesh Maha). ‘కేరాఫ్‌ కంచరపాలెం’ (Care of Kancharapalem), ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ (Uma Maheswara Ugra Roopasya) వంటి చిత్రాలతో భారీ హిట్స్ కొట్టారు. సినిమాలు చేస్తూనే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఓ షోను తెరకెక్కించారు. తాను దర్శకత్వం వహించిన భాగాన్ని చూసేటప్పుడు తల్లిదండ్రలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికను జారీ చేశారు.

Anger-Tales.jpg

‘యాంగర్ టేల్స్’ (Anger Tales) టైటిల్‌తో ‘డిస్నీ+హాట్‌స్టార్’ ఓ వెబ్‌సిరీస్‌ను రూపొందించింది. ‘రాధ’, ‘రంగా’, ‘గిరి’, ‘పూజ’ అని ఒక్కో ఎపిసోడ్‌కు ఒక్కొక్క పేరు పెట్టింది. ‘రంగా’ ఎపిసోడ్‌ను వెంకటేశ్ మహా తెరకెక్కించారు. ఈ ఎపిసోడ్‌లో భాష అందరికి అమోదయోగ్యంగా ఉండదని అందువల్ల తల్లిదండ్రలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన చెప్పారు. ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘‘రాబోయే ‘యాంగర్ టేల్స్’ అనే సిరీస్‌లోని నా ఎపిసోడ్ ‘రంగా’ లో కథానుసారంగా 18ఏళ్ల లోపు వారికి తగని భాష వాడబడినది. ఈ ఎపిసోడ్‌ను చూసేటప్పుడు తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. కానీ, మిగిలిన మూడు ఎపిసోడ్స్ ‘రాధ’, ‘గిరి’, ‘పూజ’ లను కుటుంబ సమేతంగా చూసి ఆనందించవచ్చు’’ అని వెంకటేశ్ మహా తెలిపారు. ‘యాంగర్ టేల్స్’ ప్రస్తుతం ‘డిస్నీ+హాట్ స్టార్’ లో స్ట్రీమింగ్ అవుతోంది. గతంలోనే వెంకటేశ్ మహా ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’ (Modern Love Hyderabad) వెబ్‌సిరీస్‌లో ఓ ఎపిసోడ్‌కు దర్శకత్వం వహించారు.

^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Ram Charan: ‘ఆర్‌సీ15’ కోసం పలు టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేయించిన మేకర్స్..!

Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!

Jr NTR: ధనుష్, వెట్రిమారన్‌ సినిమాపై తారక్ క్లారిటీ..

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Updated Date - 2023-03-09T18:38:54+05:30 IST