Director Teja: నచ్చకపోతే విడాకులు ఇచ్చేయమన్నా!
ABN , First Publish Date - 2023-05-25T17:25:20+05:30 IST
దర్శకుడు తేజ ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. ఏదైనా కుండ బద్దలు కొట్టినట్లు చెబుతారు. తాజాగా ఆయన తన కొడుకు, కూతురు గురించి మాట్లాడారు. త్వరలోనే తన కుమారుణ్ణి హీరోగా పరిచయం చేస్తానని చెప్పారు.
దర్శకుడు తేజ (Teja) ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. ఏదైనా కుండ బద్దలు కొట్టినట్లు చెబుతారు. తాజాగా ఆయన తన కొడుకు, కూతురు గురించి మాట్లాడారు. త్వరలోనే తన కుమారుణ్ణి హీరోగా పరిచయం చేస్తానని చెప్పారు. ఇప్పటికే యాక్టింగ్, డైరెక్షన్ కోర్స్ పూర్తి చేశాడని తెలిపారు. అలాగే తన కూతురికి పెళ్లి చేయనని సంచలన (Teja comments on Marriage) వ్యాఖ్యలు చేశారు. అందుకు కారణం కూడా చెప్పుకొచ్చారు. ‘‘మా అమ్మాయి ఫారెన్‌లో చదువు పూర్తి చేసుకుని ఇండియా వచ్చింది. తనకు నేను పెళ్లి చేయను. నచ్చిన వాడిని చూసి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోమని చెప్పాను. తర్వాత అందరినీ పిలిచి భోజనాలు పెడదామని చెప్పా. పెళ్లయ్యాక భర్త నచ్చకపోతే విడాకులు ఇచ్చేయమని చెప్పాను. మనం హ్యాపీగా బతకడం ముఖ్యం. లోకం ఏమనుకుంటుంది అనేది మనకు అనవసరం’’ అని తేజ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆయన తెరకెక్కించిన చిత్రం ‘అహింస’ (Ahimsa). దగ్గుబాటి అభిరామ్ (Abhiram Daggubati) ను కథానాయకుడిగా పరిచయం చేస్తున్నారు. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన ఈచిత్రం జూన్ 2న విడుదల కానుంది.