Narakasura : రాక్షసుడిగా మారాల్సివచ్చినప్పుడు ఏం జరిగిందంటే  

ABN , First Publish Date - 2023-11-02T17:32:21+05:30 IST

'పలాస' ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన సినిమా "నరకాసుర". అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా నటించారు. అజ్జా శ్రీనివాస్ నిర్మించారు. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించారు. శుక్రవారం తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం  రిలీజ్ కాబోతోంది.

Narakasura : రాక్షసుడిగా మారాల్సివచ్చినప్పుడు ఏం జరిగిందంటే  

'పలాస' ఫేమ్ రక్షిత్ అట్లూరి 8Rakshith atluri) హీరోగా నటించిన సినిమా 'నరకాసుర'. అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా నటించారు. అజ్జా శ్రీనివాస్ నిర్మించారు. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించారు. శుక్రవారం తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం  రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు విలేకర్లతో మాట్లాడారు. 

- దర్శకుడు కావాలనేది నా కల. ఫిల్మ్ స్కూల్ లో ట్రైనింగ్ తీసుకున్న అవకాశాల కోసం ప్రయత్నించాను. సినీమ్యాక్స్ లో ఉండే ఒక బార్ అండ్ రెస్టారెంట్ లో వెయిటర్ గా పనిచేశాను. ఒకసారి అక్కడికి వచ్చిన రాఘవేంద్రరావు గారు నా గురించి అడిగారు. ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్ ని అంటూ నా గురించి చెప్పుకోగానే..వారి అబ్బాయి ప్రకాష్ గారిని పిలిచి తన దగ్గర వర్క్  ఇప్పించమన్నారు. అలా  నా కెరీర్ సినీ రంగంలో మొదలైంది. తర్వాత 2012లో ప్రసాద్ ల్యాబ్స్ వెళ్లి అక్కడ ఉన్న టెక్నాలజీ మీద అవగాహన తెచ్చుకోవాలని ప్రయత్నించాను. అక్కడ చూస్తే వెయ్యికి పైగా సినిమాలు విడుదలకు నోచుకోకుండా పడేసి ఉన్నాయి. అవి చూశాక ..ముందు సినిమా వ్యాపారం తెలుసుకోవాలి ఆ తర్వాతే మేకింగ్ అనుకున్నా. అలా సాయి కొర్రపాటి గారి వారాహి చలన చిత్రం బ్యానర్ డిస్ట్రిబ్యూషన్ లో పని నేర్చుకునేందుకు చేరాను. అలా అక్కడ ప్రొడ్యూస్ అయిన చాలా సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ విభాగంలో పనిచేశాను. అప్పుడు బిజినెస్ అంటే ఎలా ఉంటుందో తెలుసుకున్నా.

- తొలి సినిమా అవకాశమే కష్టం అనుకుంటే 'నరకాసుర' మేకింగ్ టైమ్ లో నాకు పెద్ద యాక్సిడెంట్ జరిగి కుడి చేయి పోయింది. ఒరిస్సాలో షూటింగ్ చేసి జబల్ పూర్ వెళ్తుంటే రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. చేయి కోల్పోయినా ఆత్మవిశ్వాసంతో సినిమా పూర్తి చేశాను.

Narakasura.jpeg


'నరకాసుర' సినిమా కోసం నేను ఫస్ట్ కథ రాసి దాన్ని డెవలప్ చేసే టైమ్ లో ఒక వీడియో చూశాను. అది భరత్ అనే నేను సినిమా ఈవెంట్ లో కేటీఆర్ మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్స్ ను సినిమాల్లో కమర్షియల్ గా చూపిస్తున్నారని. అలా కాకుండా వాళ్ల ప్రాబ్లమ్స్ తో ఒక సినిమా చేస్తే బాగుంటుందని సూచించారు. అది నాకు బాగా నచ్చింది. ఆయన మాటలతో నా చిన్నప్పుడు చూసిన ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. వాటిని కలిపి ఈ కథలో ట్రాన్స్ జెండర్ అంశాన్ని పెట్టాం. ట్రాన్స్ జెండర్ కమ్యూనిటికీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

- ఈ సినిమాకు ఫస్ట్ మేము అనుకున్న పేరు "నరకాసుర" కాదు. అయితే కథ డెవలప్ చేసే టైమ్ లో ఈ టైటిల్ ఫిక్స్ చేశాం. నరకాసురుడు రాక్షసుడు కాకముందు గొప్ప రాజు, భూదేవి పుత్రుడు. ఈ సినిమాలో హీరో కూడా అలాగే గొప్ప వ్యక్తిత్వంతో ఉంటాడు. రాక్షసుడిగా మారాల్సివచ్చినప్పుడు మాత్రం నరకాసురుడి కంటే పెద్ద రాక్షసుడిగా మారతాడు. అలా టైటిల్ కు కథ రిలవెంట్ గా ఉంటుంది.

లాక్ డౌన్ లో ఈ కథ రాసుకున్నప్పుడు చాలా మంది హీరోస్ ను అప్రోచ్ అయ్యాను. అయితే ఇమేజ్ ఉన్న హీరో అయితే మన కథను అనుకున్నట్లు చేయగలిగే స్వేచ్ఛ ఉంటుందా ఉండదా అనిపించింది. అప్పుడు ప్రొడ్యూసర్స్ పలాస సినిమా చూడు రక్షిత్ సెట్ అవుతాడేమో అన్నారు. చూశాను. అతనికి కొంత టైమ్ ఈ క్యారెక్టర్ మీద ట్రైనింగ్ ఇచ్చి చేయించాం. రక్షిత్ పలాస కంటే మెచ్యూర్డ్ గా పర్ ఫార్మ్ చేశాడు.

"నరకాసుర"లో మంచి సందేశం ఉంటూనే ఎక్కడా కమర్షియల్ అంశాలు తగ్గకుండా రూపొందించాను. తదుపరి ట్రైబ్ అనే ఒక సినిమా చేస్తున్నాను. ట్రైబల్స్ లైఫ్ స్టైల్ తో  రాతియుగం నేపథ్యంగా సాగే  సినిమా ఇది. మాధవన్, అరుణ్ విజయ్, వివేక్ ఒబెరాయ్, టొవినో థామస్ వంటి స్టార్ కాస్ట్ ఉంటారు. ఆ సినిమాను మూడు భాషల్లో రూపొందించబోతున్నాను.

Updated Date - 2023-11-02T17:56:27+05:30 IST