NSR Prasad: దర్శకుడు ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ ఇకలేరు
ABN , First Publish Date - 2023-07-29T15:43:49+05:30 IST
ఆర్యన్ రాజేష్ హీరోగా మూవీ మొఘల్ డి.రామానాయుడు నిర్మించిన 'నిరీక్షణ' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ (49) అకాల మరణం చెందారు. సీతారామ్ గా పరిశ్రమ వర్గాలకు సుపరిచితుడైన ప్రసాద్... శ్రీకాంత్ తో "శత్రువు", నవదీప్ తో "నటుడు" చిత్రాలకు దర్శత్వం వహించారు.

ఆర్యన్ రాజేష్ (Aryan Rajesh) హీరోగా మూవీ మొఘల్ డి.రామానాయుడు నిర్మించిన 'నిరీక్షణ' (neerikshana) చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ (49) (NSR prasad) అకాల మరణం చెందారు. సీతారామ్ గా పరిశ్రమ వర్గాలకు సుపరిచితుడైన ప్రసాద్... శ్రీకాంత్ తో "శత్రువు", నవదీప్ తో "నటుడు" చిత్రాలకు దర్శత్వం వహించారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన 'రెక్కి' విడుదల సన్నాహాల్లో ఉంది. పలువురు ప్రముఖ దర్శకుల వద్ద రైటర్ గా, ఘోస్ట్ రైటర్ గా పనిచేసిన సీతారామ్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం.