NTR30: ఎన్టీఆర్ సినిమా కథ ముందే చెప్పేసిన దర్శకుడు
ABN , First Publish Date - 2023-03-23T12:24:24+05:30 IST
ఎన్టీఆర్30 సినిమా కథా నేపధ్యం గురించి ఆ సినిమా దర్శకుడు కొరటాల శివ కొంచెం చెప్పారు. అది ఎలా వుండబోతోంది, అందులో ఎన్టీఆర్ ఎలా వుండబోతున్నాడు అనే విషయం కూడా చెప్పేసాడు దర్శకుడు.
ఎన్టీఆర్ (NTR), కొరటాల శివ (Koratala Siva) మళ్ళీ రెండో సారి కలుస్తున్నారు. ఇంతకు ముందు వీళ్ళిద్దరూ 'జనతా గేరేజ్' (Janatha Garage) అనే ఒక విజయవంతం అయిన సినిమాకి పని చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ ఎన్టీఆర్ 30 (NTR30) కి పని చేస్తున్నారు. ఈ సినిమా గురువారం అధికారికంగా, అట్టహాసంగా పరిశ్రమలో వున్న అతిరధ మహారధుల సమక్షంలో ప్రారంభం అయింది. రాజమౌళి (Rajamouli) క్లాప్ కొత్తగా, దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కెమెరా స్విచ్ ఆన్ చేసాడు.
ఆ తరువాత ఈ చిత్ర దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ మళ్ళీ ఎన్టీఆర్ తో పని చెయ్యడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు. అలాగే ఇప్పుడు వున్న నటుల్లో ఎన్టీఆర్ అత్యద్భుతమయిన నటుడు అని కొనియాడాడు కొరటాల శివ. ఈ సినిమా కథ గురించి మాట్లాడుతూ, కథ నేపధ్యం కోస్టల్ ల్యాండ్ తీసుకున్నట్టుగా చెప్పాడు (Forgotten Coastal lands). "అక్కడ వుండే మనుషులకు దేవుడు అంటే భయం లేదు, చావు అన్న భయం లేదు, కానీ వాళ్ళు మాత్రం ఒక దానికి మాత్రమే భయపడతారు, అది ఎవరికీ అనేది ఈ సినిమా నేపధ్యం" అని కొరటాల శివ కథ గురించి చెప్పాడు.
అయితే ఈ సినిమా ఇంతవరకు తాను చేసిన సినిమాలు అన్నిటికన్నా బెస్ట్ వర్క్ అని చెపుతున్నాడు కొరటాల శివ. అలాగే అభిమానులకు, ప్రేక్షకులకు ఆనందింప చేసే విధంగా ఈ సినిమా ఉంటుందని, ఎవరిని నిరాశ పరచాడని చెపుతున్నాడు దర్శకుడు కొరటాల శివ. దీనికి సంగీతాన్ని అనిరుద్ రవిచంద్రన్ (Anirudh Ravichander) అందిస్తున్నాడు. అలాగే ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ఈ చిత్రానికి నిర్మాత. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఇందులో కథానాయికగా నటిస్తోంది.