Harish Shankar: పెరుగన్నం, బిర్యానీ.. దర్శకుడు మహాకు కౌంటర్
ABN , First Publish Date - 2023-03-11T15:08:39+05:30 IST
టాలీవుడ్ దర్శకుడు వెంకటేశ్ మహా (Venkatesh Maha) ఇటీవల ‘కెజియఫ్’ (KGF) చిత్రంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. పాన్ ఇండియా రేంజ్‌లో...
టాలీవుడ్ దర్శకుడు వెంకటేశ్ మహా (Venkatesh Maha) ఇటీవల ‘కెజియఫ్’ (KGF) చిత్రంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్ సాధించి.. భారీ కలెక్షన్స్‌ను రాబట్టింది. అయితే ఇందులోని రాఖీ భాయ్ (Rakhi Bhai) పాత్రపై మహా అసభ్య పదజాలం ఉపయోగిస్తూ కొంచెం ఘాటుగా స్పందించాడు. ఆయన వ్యాఖ్యలపై సినిమా అభిమానులే కాకుండా.. చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు పెద్దలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే మహాను ఓ ఆట ఆడేసుకున్నారు. బూతులు తిడుతూ.. ట్రోలింగ్ మొదలెట్టారు. దీంతో తగ్గిన మహా.. క్షమాపణలు కోరే పరిస్థితికి వచ్చాడు కానీ.. అందులోనూ ఓ మెలిక పెట్టాడు. ‘సారీ కాని సారీ’ అంటూ మహా చెప్పిన క్షమాపణలపై కూడా అంతా ఫైర్ అవుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ‘బలగం’ (Balagam) సక్సెస్‌మీట్‌లో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కూడా మహా మాటలపై ఇన్‌డైరెక్ట్‌గా కౌంటర్ వేశారు. ‘మంచి సినిమాను పెరుగన్నంతోనూ, కమర్షియల్ సినిమాను బిర్యానీతోనూ’ పోల్చుతూ హరీష్ ఇచ్చిన వివరణపై ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ‘‘పెరుగన్నం ఆరోగ్యానికి మంచిదే. కానీ, ఇక్కడ అందరూ బిర్యానీ ఎక్కువ ఇష్టపడుతుంటారు. అదేంటి? నా పెరుగన్నం తినట్లేదేంటి? అని అనకూడదు. మనం రెండూ లభించే ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి.. రెండూ అమ్మాలి. బిర్యానీ తినండి, ఆ తర్వాత పెరుగన్నం తినండి ఇంకా బాగుంటుంది అని చెప్పాలి. మంచి కంటెంట్ ఉన్న సినిమా, ఇటు కమర్షియల్ సినిమా రెండింటిని ప్రేక్షకుల దగ్గరకు చేర్చాలి. అదే మన పని. మంచి కంటెంట్ ఉన్న ‘బలగం’, ‘శతమానం భవతి’ వంటి చిత్రాలు విడుదలైనప్పుడు క్లాస్, మాస్ అని తేడా లేకుండా డైరెక్టర్స్ అందరూ ఆ సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు. మనకి మనమే గీతలు గీసుకోకుండా.. మనమంతా ఒకటి అని భావించాలి. చిన్న సినిమా, పెద్ద సినిమా.. ఏది హిట్టయినా.. అంతా సెలబ్రేట్ చేసుకుంటాం. (Harish Shankar Indirect Counter to Venkatesh Maha)
ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే.. ఆ సినిమాతో బయ్యర్స్‌కి డబ్బులొస్తాయి. ఆ డబ్బులని వారు మళ్లీ తర్వాత సినిమా కోసమే వాడతారు. వాళ్ల దగ్గర డబ్బులుంటేనే.. తర్వాత సినిమాకు మంచి రేటు పెడతారు. అందుకే మా సినిమాలే కాకుండా.. అందరి సినిమాలు సక్సెస్ కావాలని కోరుకుంటాం. కామన్‌సెన్స్ లేని కొందరుంటారు.. ఎదుటి వాడి సినిమా ఎప్పుడు పోతుందా అని చూస్తుంటారు. అలాంటి వారు పరిశ్రమకు ప్రమాదం. ఇండస్ట్రీ బాగుండాలంటే మన సినిమానే కాదు.. దానికి ముందు విడుదలైన సినిమా కూడా బాగా ఆడాలని కోరుకోవాలి..’’ అంటూ హరీష్ శంకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీ గురించి చాలా బాగా చెప్పారని, ఇండస్ట్రీని చాలా బాగా అర్థం చేసుకున్నారంటూ.. అందరూ హరీష్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. (Harish Shankar speech at Balagam Success Meet)
ఇవి కూడా చదవండి:
*********************************
*Pavitra Naresh: బ్యాచ్‌లర్స్ ఫీల్ కాకండి.. ఈ మీమ్స్ ఏంటి సామి?
*Ram Charan: మా నాన్న పెంపకం అలాంటిది.. ఆసక్తికర విషయాలు చెప్పిన చరణ్
*Radha Nair: తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసమో.. మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసమో?
*Nagababu: ‘ఆర్ఆర్ఆర్’ మీద కామెంట్‌కు వైసీపీ వారి భాషలో సమాధానం
*Jr NTR: ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ సైడ్ యాక్టరా? ఇలా అవమానించారేంటి?
*Lakshmi Manchu: రక్తం మరిగిపోతోంది.. మంచు లక్ష్మికి కోపం తెప్పించిన వైరల్ వీడియో..
*Star Producer: పాపం.. దీన స్థితిలో స్టార్ నిర్మాత.. ఆదుకున్న స్టార్ హీరో
*Poonam Kaur: మళ్లీ చెబుతున్నా అర్థం చేసుకోండి.. వేదికపైనే కంటతడి పెట్టిన పూనమ్ కౌర్..