DimpleHayathi: రామబాణం హీరోయిన్ కి అన్ని కష్టాలా, ధైర్యంగా ఎదుర్కొంది
ABN , First Publish Date - 2023-05-09T15:18:16+05:30 IST
మొదటి సినిమా ఒక పెద్ద సినిమా షూటింగ్ మొదలయ్యింది, అదే సమయంలో మూడు పెద్ద సినిమా ఆఫర్స్ వస్తే రిజెక్ట్ చేసింది. ఈ పెద్ద సినిమా షూటింగ్ ఆగిపోయింది, అనవసరంగా మూడు సినిమాలు వదులుకుంది, అదీ డింపుల్ పరిస్థితి, కానీ అదే సమయంలో...
గోపీచంద్ (Gopichand) నటించిన 'రామబాణం' (Ramabanam) లో అతని పక్కన కథానాయకురాలిగా నటించిన డింపుల్ హయతి (Dimple Hayathi) తెలుగు అమ్మాయే కావటం విశేషం. ఈమధ్య తెలుగు అమ్మాయిలు బాగానే వస్తున్నారు, శ్రీలీల (Sreeleela) అందులో ఒకరు. అయితే 'రామబాణం' కన్నా ముందు, డింపుల్ హయతి 'ఖిలాడీ' (Khiladi) సినిమాలో రవి తేజ (RaviTeja) పక్కన చేసింది. ఈ రెండు సినెమాలకన్నా ముందు హరీష్ శంకర్ (HarishShankar), వరుణ్ తేజ్ (VarunTej) కాంబినేషన్ లో వచ్చిన 'గద్దలకొండ గణేష్' (GaddalakondaGanesh) లో స్పెషల్ సాంగ్ చేసింది డింపుల్. అయితే ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె ఇండస్ట్రీ కి ఎలా వచ్చింది, ఎలా తన సినిమా ఆగిపోయింది అనే విశేషాలు పంచుకుంది, ఆ వార్త బాగా వైరల్ అవుతోంది.
'గడ్డగలకొండ గణేష్' సినిమాలో డింపుల్ ని హీరోయిన్ గా తీసుకుందాం అని హరీష్ అనుకున్నాడట. కానీ అప్పటికే డింపుల్ ఒక పెద్ద సినిమా షూటింగ్ లో ఉందట, ఆ సినిమా పూర్తి కాకముందే ఎందుకు వేరే సినిమా చెయ్యటం అని ఈ 'గడ్డలకొండ గణేష్' సినిమాతో పాటు, మరో రెండు పెద్ద సినిమాలు వదులుకుంది. తీరా చూస్తే ఆమె షూటింగ్ చేస్తున్న సినిమా 90 శాతం పూర్తయ్యాక షేల్వ్ అయిపోయిందట. ఆమె బాధ పాపం ఎవరితో చెప్పుకుంటుంది, ఒక పక్క పెద్ద సినిమా షేల్వ్ అయింది, మూడు పెద్ద సినిమాలు వదిలేసుకుంది, చాలా బాధ పడ్డా అని చెప్పింది.
ఆ సమయం లో దర్శకుడు హరీష్ శంకర్ మళ్ళీ ఫోన్ చేసాడట. అతను మంచివాడు కాబట్టి ఫోన్ చేసాడు, వేరే వాళ్ళు అయితే ఫోన్ కూడా చెయ్యరు అని చెప్పింది. హరీష్ శంకర్ ఫోన్ చేసి స్పెషల్ సాంగ్ వుంది చేస్తావా అని అడిగితే, చేస్తాను అని చెప్పిందట. కుటుంబం ఓ వాళ్ళు, స్నేహితులు ఆ సాంగ్ చెయ్యొద్దు అని చెప్పారట. కానీ డింపుల్ ఒకటే నమ్మిందిట. ముందు హీరోయిన్ ఛాన్స్ ఇస్తా అన్నాడు, ఒక నెల వెయిట్ చేసాడు కూడా, మళ్ళీ తనే ఫోన్ చేసి స్పెషల్ సాంగ్ ఆఫర్ చేసాడు. అందుకని హరీష్ శంకర్ మీద గౌరవం పెరిగి ఆ సాంగ్ ఎందరు వద్దన్నా కూడా చేసిందిట. ఆలా చెయ్యడం వలెనే ఈరోజు మళ్ళీ ఈ సినిమాలు అన్నీ చెయ్యగలుగుతున్నాను అని చెప్పింది.
ఎందుకంటే ఆ స్పెషల్ సాంగ్ కి మంచి ఆదరణ లభించింది. ప్రేక్షకులు ఆ సాంగ్ కి బ్రహ్మరధం పట్టారు. డింపుల్ నమ్మకం మళ్ళీ పెరిగింది, ధైర్యం వచ్చింది, పాతవన్నీ మర్చిపోయి, మళ్ళీ కొత్తగా మొదలెట్టి, ఈరోజు వరస సినిమాలతో దూసుకుపోతోంది.