TelanganaPolitics: దిల్ రాజు బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నాడా...

ABN , First Publish Date - 2023-03-01T16:06:44+05:30 IST

ప్రముఖ నిర్మాత దిల్ రాజు (#DilRaju) రాబోయే రోజులలో రాజకీయాల్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయనున్నాడా? ఇది చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం వినిపిస్తున్న ప్రశ్న. అయితే దీనికి అవును అనే సమాధానమే ఎక్కువ వినపడుతోంది.

TelanganaPolitics: దిల్ రాజు బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నాడా...

ప్రముఖ నిర్మాత దిల్ రాజు (DilRaju) రాబోయే రోజులలో రాజకీయాల్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయనున్నాడా? ఇది చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం వినిపిస్తున్న ప్రశ్న. అయితే దీనికి అవును అనే సమాధానమే ఎక్కువ వినపడుతోంది. ఎందుకంటే నిన్న సిరిసిల్ల (#Sircilla) లో జరిగిన తన 'బలగం' (BalagamFilm) సినిమా ప్రీ-రిలీజ్ వేడుక ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. దిల్ రాజు ఈమధ్య ఎక్కువగా రాజకీయాలు మాట్లాడుతున్నాడని రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి రావొచ్చు అని అందుకనే ఎక్కువగా తన సొంత జిల్లా అయిన నిజామాబాదు (Nijamabad) లో ఎక్కువగా తిరుగుతున్నాడని కూడా పరిశ్రమలో అంటున్నారు. నిజామాబాదు జిల్లా నర్సింగపల్లి (Narsingapalli) దిల్ రాజు సొంత వూరు.

dilraju-ktr.jpg

నిన్న జరిగిన 'బలగం' సినిమా ప్రీ-రిలీజ్ వేడుకకి తెలంగాణ ఐ.టి. మినిస్టర్ కె.టి. రామారావు (KTR) ముఖ్య అతిధిగా వచ్చారు. సిరిసిల్ల కి సినిమా తీసుకు వచ్చిన దిల్ రాజు ను అభినందించారు కె.టి.ఆర్. అలాగే దిల్ రాజు కూడా కె.టి.ఆర్. ని పొగడ్తలతో ముంచెత్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచటం లో కె.టి.ఆర్ (KTR), కె.సి.ఆర్ (KCR) గార్ల కృషి ఎంతో ఉందని అక్కడ వున్న కె.టి.ఆర్ గురించి కూడా చాల గొప్పగా మాట్లాడాడు దిల్ రాజు. ఇవన్నీ చూస్తుంటే, దిల్ రాజు ఈసారి కచ్చితంగా రాజకీయాల్లోకి రావాలన్న తలంపు ఉన్నట్టు కనపడుతోందని తెలుస్తోంది. అలాగే బి.ఆర్.ఎస్. (BRS) నుండి టికెట్ కూడా ఆశిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. తన సొంత జిల్లా అయినా నిజామాబాదు లో ఎక్కడ నుండి అయినా పోటీ చేయొచ్చు అనే సంకేతాలు కూడా వినపడుతున్నాయని తెలుస్తోంది.

దిల్ రాజు తన సినిమా 'బలగం' 95 శాతం తెలంగాణ నటులు, సాంకేతిక నిపుణలతో చేసినట్టుగా చెప్తున్నాడు. ఒక్క 5 శాతం మాత్రమే ఆంధ్ర వాళ్ళు ఇందులో పని చేశారని, ఇది మొత్తం తెలంగాణ కి సంబదించిన సినిమా అని ప్రచారం చేస్తున్నాడు. ఇప్పుడు దిల్ రాజు తెలంగాణ భాష, సంస్కృతి, సంప్రదాయాల మీద సినిమా తీయటం కూడా తన రాజకీయ ప్రస్థానానికి నాంది పలకడానికి అన్నట్టుగ్గ పరిశ్రమలో టాక్ నడుస్తోంది.

Updated Date - 2023-03-01T16:33:15+05:30 IST