Dil Raju : దిల్ రాజు అల్లుడి కారు కొట్టేసిన వాడి సమాధానం విని పోలీసులు షాక్..
ABN , First Publish Date - 2023-10-14T15:45:08+05:30 IST
టాలీవుడ్ అగ్ర నిర్మాత, శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స అధినేతి దిల్ రాజు అల్లుడు కారు చోరీకి గురైంది. దిల్ రాజు అల్లుడు అర్చిత రెడ్డి రూ. కోటిన్నర విలువైన పోర్షే కారు చోరీకి గురైంది. పోలీస్ స్టేషనలో ఫిర్యాదు చేయగా

టాలీవుడ్ అగ్ర నిర్మాత, శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ అధినేతి దిల్ రాజు అల్లుడు కారు చోరీకి గురైంది. దిల్ రాజు అల్లుడు అర్చిత్ రెడ్డి రూ. కోటిన్నర విలువైన పోర్షే కారు చోరీకి గురైంది. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా అప్రమత్తమైన పోలీసులు గంట వ్యవధిలో కారును సొంతం చేసుకున్నారు. అయితే దొంగ చెప్పిన సమాధానం విన్న పోలీస్‌లు అవాక్కయ్యారు.
అసలేం జరిగిందంటే.. దిల్ రాజు అల్లుడు అర్చిత్ రెడ్డి శుక్రవారం ఉదయం రూ.1.7 కోట్ల విలువల గల పోర్షే కారులో దస్‌పల్లా హోటల్‌కు వెళ్లారు. అక్కడ కారు ఆపి లోపలికి వెళ్లారు. 40 నిమిషాల తర్వాత బయటకు వచ్చేసరికి కారు బయట కనిపించలేదు. దీంతో అర్చిత్ రెడ్డి వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద కారు సిగ్నల్ జంప్ చేసినట్లు గుర్తించారు. వెంటనే కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కారును ఆపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే కారు దొంగ చెప్పిన సమాధానం విని పోలీసులు షాక్ అయ్యారు. తాను వ్యాపారవేత్త ఆకాష్ అంబానీ పి.ఎ అంటూ పోలీసులకు చెప్పాడు. హృతిక్ రోహన్ నా పీఏ అంటూ గర్వం చూపిస్తూ మాట్లాడాడు. ఒక్క మంత్రిని పిక్ అప్ చేసుకోవడం కోసం కారు తీసుకొని వెళ్తున్నా అని పోలీసులనే దబాయించాడు. తనని వదిలేస్తే అంబానీ దగ్గరకు వెళ్తానని పోలీసులను బెదిరించాడు. ఆ మాటలు విన్న పోలీసులు తలలు పట్టుకున్నారు. కాసేపటి తర్వాత కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి అతని గురించి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. కారును దొంగిలించిన వ్యక్తికి మతిస్థిమితం లేదని, బ్రైట్ లైఫ్ ఫౌండేషన్‌లో చికిత్స అందించారని తెలిసింది. నిందితుడు హైదరాబాద్ మన్సూరాబాద్ ప్రాంతానికి చెందిన మల్లెల సాయికిరణ్‌గా గుర్తించారు. అర్చిత రెడ్డి ఓ గంటలో కారును అప్పటించారు.