Dil Raju: మా అన్నని చూసి చాల రోజులయింది, కానీ ఏమి జరిగిందంటే...

ABN , First Publish Date - 2023-03-06T14:30:23+05:30 IST

నిర్మాత దిల్ రాజు ఎన్నో పదుల సార్లు తన సినిమా 'బలగం' చూసి వున్నా, విడుదల అయిన మొదటి రోజు ప్రేక్షకులతో అదే సినిమా చూసిన ఆ అనుభవం అతన్ని ఎలా మార్చిందో అయన మాటల్లోనే...

Dil Raju: మా అన్నని చూసి చాల రోజులయింది, కానీ ఏమి జరిగిందంటే...

ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju)ని, అతను ఈమధ్య తీసిన 'బలగం' (Balagam) సినిమాని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ (Film Critics Association) ఆదివారం నాడు, ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా దిల్ రాజు (Dil Raju) మాట్లాడుతూ, ఇలా క్రిటిక్స్ తో తన సినిమాని, అంతటి మంచి సినిమా తీసినందుకు తనని గౌరవించటం అది సినిమా విజయంగా చెప్పాడు. అదే సభలో దిల్ రాజు తన వ్యక్తిగత సంఘటనల్ని కూడా కొన్ని చెప్పాడు.

'బలగం' సినిమా దిల్ రాజు నిర్మాతగా ఎన్నో సార్లు చూసాడు. అంటే ఎడిట్ రూమ్ లో, అలాగే ప్రొడక్షన్ అంతా అయిపోయాక ఒకసారి, ఇలా ఎన్నోసార్లు చూసి వున్నాడు. అలాగే కథ కూడా అతనికి తెలుసు, అందుకని తెరమీద చూస్తున్నప్పుడు ఏమవుతుందో, ఏ సన్నివేశం వస్తుందో కూడా తెలుసు. ఇలా ఎన్నోసార్లు ఆ సినిమాని చూసినా, మొదటి రోజు విడుదల అయినపుడు ప్రేక్షకులతో, థియేటర్ లో చూసిన ఆ అనుభవం మాత్రం మరిచిపోలేనిది అంటాడు దిల్ రాజు.

balagam-team.jpg

ఆ విషయం గురించి మాట్లాడుతూ, తన అన్న ఇంటికి వెళ్లక చాలా రోజులు అయింది అన్నాడు. ఎందువల్ల అన్నదానికి చాలా కారణాలు వున్నాయి, సినిమాలతో బిజీ బిజీ. "అది అన్న వాళ్ళకి కూడా తెలుసు. కానీ నేను 'బలగం' సినిమా ప్రేక్షకులతో చూసి బయటకి వచ్చాక, నాకు చెప్పలేని భావోద్వేగం కలిగింది. బయటకి కన్నీళ్లు రావటం లేదు, ఎందుకంటే నేను ఏడిస్తే బాగోదు, అని లోపల దిగమింగుకున్నాను. అప్పుడు నా అన్న కొడుకు హర్షిత్ కూడా ఫోన్ చేస్తే, మళ్ళీ మాట్లాడతా అని చెప్పి పెట్టేసా. ఎందుకంటే నాలో భావోద్వేగం ఆలా వుంది. అప్పుడు అనుకున్నాను, తెల్లవారగానే అన్న ఇంటికి వెళ్లాలని. మార్నింగ్ లేవగానే, నా కొడుకుని తీసుకొని నా అన్న ఇంటికి వెళ్లి అన్నని, అందరిని పలకరించా," అని చెప్పుకొచ్చాడు దిల్ రాజు.

'బలగం' సినిమా చూసాక తన వ్యక్తిగత అనుభవం అలాంటిది అని చెప్పాడు దిల్ రాజు. ఎందుకంటే ముందు కుటుంబం, తరువాతే ఏదైనా. జీవితం లో బిజీ కానిది ఎప్పుడు, కానీ కుటుంబానికి ముందు ప్రాధాన్యం ఇవ్వాలి, అందుకనే దిల్ రాజు వెంటనే అన్న ఇంటికి వెళ్లి అన్నని, కుటుంబాన్ని పలకరించి తరువాత తన పని ప్రారంభించాడు. అప్పుడు మనసుకి కూడా తృప్తి, చాలా బరువు తగ్గినట్టు ఉంటుంది. ఇలా 'బలగం' ఎంతోమందిని కదిలించింది, కదిలిస్తోంది కూడా... అందులో వుండే భావోద్వేగాలు అలాంటివి మరి... దీనికి దర్శకుడు వేణు (Venu Eldandi) కాగా, ఇందులో ప్రియదర్శి (Priyadarshi), కావ్య కళ్యాణ్ రామ్ (Kavya Kalyanram) లీడ్ పెయిర్ గా చేశారు. (Jabardasth Venu)

Updated Date - 2023-03-06T14:30:24+05:30 IST