Dhee -Chaitanya: అప్పుల బాధ తట్టుకోలేక కొరియోగ్రాఫర్‌ ఆత్మహత్య!

ABN , First Publish Date - 2023-05-01T09:56:51+05:30 IST

తెలుగు టెలివిజన్‌ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. యువ డాన్స్‌ కొరియోగ్రాఫర్‌ చావా చైతన్య (31) మృతి చెందారు. ‘ఢీ’ డాన్స్‌ షోతో పాపులర్‌ అయిన చైతన్య (31) శనివారం ఆత్మహత్య చేసుకొన్నారు.

Dhee -Chaitanya: అప్పుల బాధ తట్టుకోలేక కొరియోగ్రాఫర్‌ ఆత్మహత్య!

తెలుగు టెలివిజన్‌ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. యువ డాన్స్‌ కొరియోగ్రాఫర్‌ చావా చైతన్య (Chaavaa Chaitanya) (31) మృతి చెందారు. ‘ఢీ’ (Dhee show) డాన్స్‌ షోతో పాపులర్‌ అయిన చైతన్య (31) శనివారం ఆత్మహత్య చేసుకొన్నారు. నాలుగున్నరేళ్లగా ఢీ షోలో డ్యాన్స్‌ మాస్టర్‌గా పనిచేస్తున్న ఆయన శనివారం నెల్లూరులో కళాంజలి సాంస్కృతిక సంస్థ నిర్వహించిన ప్రపంచ నృత్య దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని అవార్డు అందుకొన్నారు. తర్వాత నెల్లూరు క్లబ్‌ హోటల్‌లో రూమ్‌ (Chaitanya passed away) తీసుకున్నారు. అప్పుల బాధతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆదివారం ఉదయం ఎంత సేపటికి తలుపుతు తీయకపోవడంతో అనుమానం వచ్చిన హోటల్‌ సిబ్బంది దర్గామిట్ట పోలీసులకు సమాచారం అందించారు. హాటల్‌కు చేరుకున్న పోలీసులు గది కిటికీలో నుంచి చూడగా చైతన్య ఫ్యానుకు వేలాడుతూ కన్పించారు. తలుపులు పగలగొట్టి చూడగా చైతన్య మృతి చెందారు. ధనలక్ష్మిపురంలో ఉంటున్న చైతన్య మేనమామ మాల్యాద్రి ఫిర్యాదు మేరకు దర్గామిట్ట పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌ మార్చురీకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. (Dhee choreographer Chaitanya commits suicide)

సెల్ఫీ వీడియో ద్వారా తల్లిదండ్రులకు క్షమాపణ, తన తోటి డ్యాన్స్‌ మాస్టర్లకు, డ్యాన్సర్లకు క్షమాపణ చెప్పారు. అప్పుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్మకు పాల్పడినట్లు చెప్పారు. ‘‘ఒక అప్పును పూడ్చుకునేందుకు.. మరో తప్పు.. అలా అప్పులు పెరిగిపోయాయి. నేమ్‌, ఫేమ్‌ ఇచ్చిన ‘ఢీ’ షోకు రుణపడి ఉంటా. ఈ ప్రోగ్రాంతో పేరు బావుంది కానీ సంపాదన తక్కువగా ఉందని, జబర్దస్త్‌ ప్రోగ్రాంలో ఎక్కువ మనీ ఇస్తున్నారని.. అయినా ‘ఢీ’ షో మంచి గుర్తింపు ఇచ్చిందని’ వీడియోలో పేర్కొన్నాడు. నెల్లూరు జిల్లా కావలి మండలం, మట్టువారిపాలెం.. చైతన్య స్వస్థలం. మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసి డాన్స్‌ రంగం వైపు వచ్చాడు .

Updated Date - 2023-05-01T10:53:25+05:30 IST