Devara: నెక్ట్స్ అప్‌డేట్ ఏంటంటే..
ABN , First Publish Date - 2023-08-01T16:54:32+05:30 IST
ఎన్టీఆర్ (Jr ntr) హీరోగా కొరటాల శివ (koratala siva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’ (Devara). శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కథానాయికగా టాలీవుడ్‌కి పరిచయమవుతున్నారు. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు.

ఎన్టీఆర్ (Jr ntr) హీరోగా కొరటాల శివ (koratala siva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’ (Devara). శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కథానాయికగా టాలీవుడ్‌కి పరిచయమవుతున్నారు. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఏప్రిల్ 5న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్ పేరుతో విడుదల చేసిన ట్రైలర్‌కు చక్కని స్పందన వచ్చిన సంగతి తెలిసిందే! తాజా అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. దసరా కానుకగా ఈ సినిమా నుంచి పవర్ ఫుల్ టీజర్‌ను విడుదల చేయబోతునట్లు సమాచారం. ఇటీవల ఈ చిత్రం తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఎన్టీఆర్ సహా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరణ చేయడానికి దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్ హిందీ సినిమా వార్ 2 షూటింగ్ పాల్గొనబోతున్నారు.