BiggBoss 7 Eliminations : బయటికొచ్చాక ఒక్కొక్కరికీ గట్టిగా ఇచ్చేసింది!
ABN , First Publish Date - 2023-09-25T09:54:23+05:30 IST
బిగ్‌బాస్ సీజన్-7 మూడో వారం ఎలిమినేషన్ ముగిసింది. ఈ వారం అతిథిగా స్కంద’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రామ్ పోతినేని బిగ్‌బాస్ వేదికపైకి వచ్చి సందడి చేశారు. హౌస్‌మేట్స్‌తో డ్యాన్స్ వేయించారు. అనంతరం నాగార్జున ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగించారు.
బిగ్‌బాస్ సీజన్-7 మూడో వారం ఎలిమినేషన్ ముగిసింది. ఈ వారం అతిథిగా స్కంద’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రామ్ పోతినేని బిగ్‌బాస్ వేదికపైకి వచ్చి సందడి చేశారు. హౌస్‌మేట్స్‌తో డ్యాన్స్ వేయించారు. అనంతరం నాగార్జున ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగించారు. ‘పచ్చ బొట్టు’ సాంగ్ ఫేం దామిని భట్ల హౌస్ నుంచి బయటకొచ్చింది. ప్రియాంక జైన్, శుభశ్రీ, రతిక, దామిని, ప్రిన్స్ యావర్, గౌతమ్‌కృష్ణ, అమర్‌దీప్‌లు నామినేషన్స్ ఉండగా, చివరికి వచ్చేసరికి దామిని, శుభశ్రీ మిగిలారు. ఈ సందర్భంగా ఇద్దరి ఫొటోలను షిప్‌లపై అంటించి ‘ఏది పేలితే వారు ఎలిమినేట్ అయినట్లు’ అని నాగార్జున ప్రకటించగా, దామిని ఫొటో అంటించిన షిప్ పేలిపోయింది. దీంతో దామిని ఎలిమినేట్ అయినట్లు నాగార్జున వెల్లడించారు. దామిని పేరు ప్రకటించగానే ప్రియాంక జైన్, సందీప్ మాస్టర్ భావోద్వేగానికి గురయ్యారు. ‘ఇదంతా గేమ్ అమ్మా.. ఎమోషన్ అవ్వొద్దు’ అని శివాజీ సలహా ఇచ్చాడు. ఇంటి నుంచి బయటకు వచ్చిన దామిని ఇంకొన్ని రోజులు ఇంట్లో ఆడతాననే నమ్మకంగా ఉన్నాను. కానీ ఊహించని విధంగా జరిగింది. ఈ ఎలిమినేషన్‌లో నేను ఉంటానని అసలు అనుకోలేదు. అయితే హౌస్‌లోకి వచ్చి మూడు వారాలే కావడంతో, ఇంట్లో వాళ్లను వదిలేసి వచ్చానన్న ఫీలింగ్ కలగలేదు. ఇంకా ముందుకు వెళ్తానని అనిపించింది’ అని దామిని అన్నారు. హౌస్‌మేట్స్ ఫొటోలు అంటించిన బెలూన్స్‌ను బద్దలు కొట్టి ప్రతి ఒక్కరికీ ఒక సలహా ఇవ్వమని నాగార్జున సూచించారు. దాంతో దామిని ఇంటి సభ్యులు ఒక్కోక్కరికి సలహా ఇచ్చింది.
‘వాదన చేస్తున్నప్పుడు సగం సగం వినకు ముఖ్యమైన పాయింట్లకే జవాబు ఇవ్వు’ అని రతికకు చెప్పింది. తేజ విషయానికొచ్చేసరికి ‘అతను ఎవరి మనసు నొప్పించనని కొన్ని రూల్స్ పెట్టుకున్నాడు. ఈ షోలో అది వర్కవుట్ అవ్వదు’ అని చెప్పి ఏదన్నా చెప్పాలనుకుంటే ముఖంపైనే తేల్చేయ్’ అని సూచించింది. ‘ఏం చెప్పినా ముందు అర్థం చేసుకో ప్రిన్స్. తొందరపడొద్దు. తెలుగు అర్థం చేసుకో. తెలియకపోతే హౌస్‌మేట్స్‌ను అడుగు. కోం తెచ్చుకోకు’ అని సలహా ఇచ్చింది దామిని. ‘సందీప్ మీరు అందరినీ డామినేట్ చేస్తున్నారు కొంచెం తక్కువ ఆడండి. గతవారం టాస్క్‌లో కొంచెం ఫేవర్ చూపించారు’’ అని అంది. ‘‘ప్రియాంక ఇంకా బాగా ఆడు. నీలో ఆ సత్తా ఉంది. నాలాగా ఎక్కువ ేసపు కిచెన్‌లో ఉండొద్దు’ అని తెలిపింది. గౌతమ్ తనకు మంచి స్నేహితుడని తెలిపింది దామిని. అన్నీ తనకే తెలుసనుకుంటాడు. అదే తగ్గించుకుంటే మంచిది’’ అని చెప్పారు. ‘అమర్‌దీప్ అందరితోనూ ఒకేలా ఉండండి. ముందు నుంచి పరిచయం ఉన్న వాళ్లతో కూడా మీరు చెప్పాలనుకున్నది స్పష్టం చెప్పండి’ అని చెప్పారు దామిని. ‘శుభశ్రీ చాలా చాలా ట్రిక్కీ. హౌస్‌లో కొంచెం ఎక్కువ పనిచెయ్. ఏయే పనులు చేయాలో మిగిలిన వాళ్లను అడుగు’ అని హితవు పలికింది. ‘కేవలం ప్రియాంక, అమర్‌దీప్‌లతోనే కాదు, అందరితోనూ కలిసి ఉండు. తేజను దూరం పెట్టు. అతను నిన్ను ఆడనివ్వడు’’ అని శోభాశెట్టికి సజెషన్ ఇచ్చింది.
శివాజీపై అయితే బాగానే డైలాగ్‌లు వేసింది. ‘‘నేను ేసఫ్ ఆడానని మీరు అన్నారు. మీరు ఒకరిద్దరికి ఫేవర్‌గా ఉండటం నాకు నచ్చలేదు’’ అని దామిని అనగా శివాజీ మధ్యలో అందుకుని ‘నేను చెప్పింది నిజమో.. కాదో.. మీ స్నేహితులను అడుగు. ఒకసారి ఇప్పటివరకూ జరిగి బిగ్‌బాస్ చూడు. నాది తప్పు అయితే, నేను అన్న మాటలు వెనక్కి తీసుకుంటా. నీకు క్షమాపణ చెబుతా’ అన్నాడు. ‘ప్రశాంత్ ఏం చెప్పినా చేస్తాడు. కానీ, గోడమీద బల్లిలా ఉంటాడు. నామినేషన్స్ రోజున మాత్రం పులిలా మారిపోతాడు’’ అని పేర్కొంది.